సినీ కార్మికులకు అదిరిపోయే శుభవార్త అందింది. కార్మికులవేతనాల విషయంలో ఫిలిం ఛాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సంయుక్త ప్రకటన చేసింది. తాజాగా కార్మికుల వేతనాలు విధి విధానాలు ఖరారు చేసింది.
పెద్ద సినిమాలకు 30% , చిన్న సినిమాలకు 15 % వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఫిలిం ఛాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. ఏది చిన్న సినిమా, ఏది పెద్ద సినిమా అనేది ఫిలిం ఛాంబర్ & ఫెడరేషన్ కలిసి నిర్ణయం తీసుకుంది. ఇక 01-07-2022 నుంచి 30-06-2025 వరకు ఇవే రేట్లు అమలు కానున్నట్లు ఫిలిం ఛాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పేర్కొంది. ఇక ఫిలిం ఛాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం పై సినీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.