అక్కినేని నాగ చైతన్య కు విడాకులు ఇచ్చిన అనంతరం..హీరోయిన్ సమంత కు ఇంకా క్రేజ్ పెరిగింది. సమంత ఏం చేసినా ట్రెండ్ అవుతోంది. అటు సినిమాల్లోనూ బంపర్ ఆఫర్లు తగులుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత.. హాలీవుడ్ సినిమాలకు ఒకే చెప్పింది. అయితే.. ఇటీవల కాలంలో విహార యాత్రలు, సాహస యాత్రలు చేస్తూ..ఫుల్ ఎంజాయ్ చేస్తుంది హీరోయిన్ సమంత.
ఇక ఇందులో భాగంగానే ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో ఉన్న సమంత.. స్కీయింగ్ చేస్తూ హాలీడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది సామ్. ”గతంలో ఎప్పుడూ ఇది ట్రై చేయలేదు. స్కీయింగ్ చాలా సాహసోపేతమైంది. అనుకోకుండా ఏదైనా జరిగితే.. ప్రాణాలను కోల్పోయే ప్రమాదమూ ఉంది. అయినా సరే నేను విజయవంతంగా పూర్తి చేశాను. దీనిని పూర్తి చేసి ప్రాణాలతో ఉన్నానంటే దానికి స్కీయింగ్ ట్రైనర్స్ కేట్, టోనెస్కి కారణం” అంటూ స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది హీరోయిన్ సమంత.