Vijay Devakakonda: విజయ్ చేసిన పనికి ఏడ్చేసిన సమంత..ఏం చేశాడంటే?

-

రౌడీ హీరో విజయ్ దేవరకొండ – ‘నిన్నుకోరి, మజిలీ’ ఫేమ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబో మూవీ #VD11 పూజా కార్యక్రమాలు గురువారం ఘనంగా జరిగాయి. చిత్ర పరిశ్రమకు చెందిన దర్శక నిర్మాతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చక్కటి లవ్ స్టోరితో ఈ సినిమా తెరకెక్కబోతున్నది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో సినిమా రాబోతున్నది. కాగా, ఈ చిత్రంలో కథానాయికగా నటించే సమంత పూజా కార్యక్రమానికి రాకపోవడం చర్చనీయాంశమైంది.

సమంత పూజా కార్యక్రమానికి రాకపోవడం రౌడీ హీరో విజయ్ దేవరకొండకు కూడా నచ్చనట్లుంది. ఈ విషయమై సమంతను ఎందుకు రాలేదు? అని అడగాలనుకున్నాడో ఏమో తెలియదు. కానీ, ట్విట్టర్ వేదికగా ఓ ఫన్నీ పోస్టు పెట్టాడు. సదరు పోస్టు విషయమై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది. గురువారం నాటి పూజా కార్యక్రమానికి సంబంధించిన నిజమైన ఫొటో ఇదే నంటూ విజయ్ దేవరకొండ ఓ ట్వీట్ చేశాడు.

సదరు ట్వీట్ లోని ఫొటోనే మీడియా వాళ్లు తీసుకోవాలని కోరాడు. కాగా, ఆ ఫొటోలో సమంత ఫొటోను యాడ్ చేశాడు. ఆ ఫొటో ఫొటోషాప్ ద్వారా యాడ్ చేయబడినట్లు స్పష్టంగా కనబడుతోంది. కాగా, ఈ ట్వీట్ చూసిన సమంత..ఏడ్చేసినట్లు సింబల్ పెట్టేసి.. రీ ట్వీట్ చేసింది.

ఈ విషయం ప్రజెంట్ చర్చనీయాంశంగా మారింది. సమంత తన వర్క్స్ లో బిజీగా ఉండటం వల్లే పూజా కార్యక్రమాలకు రాలేదని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ, సమంత గతంలో ‘మహానటి’ చిత్రంలో జోడీగా నటించారు. త్వరలో శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో మళ్లీ జోడీగా నటించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news