సమంత: ఈ ఒక్క షాట్ కోసమైనా యశోద మూవీ చూడాల్సిందే భయ్యా..!

-

సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన తాజా పాన్ ఇండియా చిత్రం యశోద.. ఈ సినిమా ఈరోజు విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా చూడడానికి కొన్ని ప్రత్యేక కారణాలు కూడా లేకపోలేదు.అయితే సమంత నటించిన యశోద సినిమాను ఈ ఒక్క షాట్ కోసమైనా సరే తప్పకుండా చూడాల్సిందే. అంతలా ఈ సినిమాకు హైలెట్ గా నిలవబోతోంది ఈ ఒక్క సన్నివేశం మరి అదేంటో ఇప్పుడు చూద్దాం..

సమంత లీడ్ రోల్ పోషిస్తూ వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం యశోద. హరి హరీష్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.. కేవలం సమంతకి ఉన్న క్రేజ్ కారణంగా ఈ చిత్రానికి మరింత బజ్ ఏర్పడిందని చెప్పవచ్చు.. ఇకపోతే ఈ సినిమా చూడడానికి గల ప్రధాన కారణాలు ఏమిటి అనే విషయానికి వస్తే.. సమంత మొదటిసారి తెలుగులో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం యశోద.. చైతన్యతో బ్రేకప్ అయిన తర్వాత ఈ సినిమా వస్తుండడంతో ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

ఇకపోతే సమంత తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా ఇందులో యాక్షన్ సన్నివేశాలలో ఇరగదీసారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే ముందుకు వెళుతూనే ఉంటా అని దృఢంగా నిశ్చయించుకున్న ఈ ముద్దగుమ్మ ఎంతో మందికి ఆదర్శం. తన అనారోగ్య పరిస్థితుల్లో కూడా లెక్కచేయకుండా ఈ సినిమా కోసం నటించింది. కాబట్టి తప్పకుండా ఈ సినిమా చూడాల్సిందే. ఇక ఫైనల్ గా ఈ సినిమా చూడడానికి ఒకే ఒక కారణం సమంత యాక్షన్ సీన్స్.. స్టార్ హీరోలు కూడా డూప్ లేకుండా యాక్షన్స్ సన్నివేషాలు చేయడానికి సాహసించరు. అలాంటిది స్టార్ హీరోలకే చెమటలు పట్టిస్తూ.. యాక్షన్ సన్నివేశాలలో సమంత ఎలా మెప్పించింది అనే దాని కోసమైనా కచ్చితంగా చూడాలి . అంతేకాదు సమంత యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు హైలైట్ గా మారనున్నట్లు ఇదివరకే ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ వెల్లడించింది. మరి సమంత తన శక్తినంత ధారపోసి ఈ సినిమాలో నటించింది. మరి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version