అక్షయ్ కుమార్ తో సమంత రొమాంటిక్ స్టెప్పులు.. వీడియో వైరల్..!!

-

సమంత మొదటిసారి ఐటెం సాంగ్ లో నటించిన చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన.. ఊ అంటావా మావ.. ఉ ఊ అంటావా.. మావా అంటూ తెలుగు ప్రేక్షకులతో సహా యావత్ సినీ ప్రేక్షకులను ఊపేసిన పాట ఇది అని చెప్పవచ్చు . ఇక ఈ సినిమాలో సమంత ఊరమాస్ స్టేప్పులతో చాలా రొమాంటిక్గా సినీ ప్రేక్షకులను మైమరిపించింది. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయితే బన్నీ – సమంత స్టెప్పులకు అంతకు మించిన క్రేజ్ లభించింది అని చెప్పవచ్చు. ఇప్పటికే కూడా సోషల్ మీడియాలో రీల్స్, షేర్ చాట్, మోజ్ వంటి యాప్ ల ద్వారా చాలామంది ఈ పాటకు స్టెప్స్ వేస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం.

ఇకపోతే తాజాగా ఈ బీట్ కి అక్షయ్ కుమార్ తో కలిసి సమంత మరొకసారి కాలు కదిపింది. ముఖ్యంగా అల్లు అర్జున్ స్టైల్ లో సమంతతో కలిసి అక్షయ్ కుమార్ కూడా మాస్ అండ్ రొమాంటిక్ స్టెప్పులతో అదరగొట్టాడు. ఇకపోతే బాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ షో గా గుర్తింపు తెచ్చుకున్న కాఫీ విత్ కరణ్ షో కి తాజాగా అక్షయ్ కుమార్ తో పాటు సమంతా కూడా హాజరయ్యారు. ఇక ఈ షోలో వీరిద్దరూ సందడి చేయడం జరిగింది. ఇకపోతే కరణ్ జోహార్ అడిగే ప్రశ్నలకు తమదైన శైలిలో ఇద్దరూ కూడా ఫన్నీ ఆన్సర్స్ ఇస్తూ బాగా ఆకట్టుకున్నారు.

ఇకపోతే వీరిద్దరూ చాలా బాగా స్టెప్స్ వేయడమే కాకుండా చివర్లో అక్షయ్ కుమార్ సమంతను ఎత్తుకు రావడం కూడా మనం ఈ వీడియోలో చూడవచ్చు. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ వాళ్ళు విడుదల చేసి.. ద కూల్ అండ్ ద కిల్లర్.. హౌస్ లో టెంపరేచర్ పెంచేస్తున్నారు అంటూ కింద క్యాప్షన్ కూడా పెట్టారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట బాగా వైరల్ గా మారిపోయింది. ఇకపోతే అక్షయ్ కుమార్ ఇటీవల సమంతతో కలిసి ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news