వాహ్‌.. 7000 ఎంఏహెచ్ బ్యాట‌రీతో వ‌స్తున్న శాంసంగ్ కొత్త ఫోన్‌..!

-

ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్ త్వ‌ర‌లో గెలాక్సీ ఎం51 స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో లాంచ్ చేయ‌నుంది. ఈ ఫోన్‌కు చెందిన ప‌లు స్పెసిఫికేష‌న్లు ప్ర‌స్తుతం నెట్‌లో లీక‌య్యాయి. ఇందులో 6.7 ఇంచుల ఫుల్‌ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన అమోలెడ్ పంచ్ హోల్ డిస్ ప్లేను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిసింది. అలాగే 6/8 జీబీ ర్యామ్ ఆప్ష‌న్ల‌ను ఇందులో అందివ్వ‌నున్న‌ట్లు స‌మాచారం.

Samsung Galaxy M51 releasing with 7000 mah mammoth battery

ఈ ఫోన్‌లో 128జీబీ వ‌ర‌కు ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌ని అందిస్తార‌ని తెలుస్తోంది. వెనుక వైపు 64 మెగాపిక్స‌ల్ కెమెరా క‌లిపి మొత్తం 4 కెమెరాల‌ను అందిస్తార‌ని తెలిసింది. అలాగే ఈ ఫోన్‌లో 7000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ క‌లిగిన బ్యాట‌రీని ఏర్పాటు చేసిన‌ట్లు తెలిసింది. అందువ‌ల్ల ఈ ఫోన్‌కు బ్యాట‌రీయే ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ అని చెప్ప‌వ‌చ్చు. ఈ బ్యాటరీకి 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్‌ను కూడా ఇస్తున్న‌ట్లు తెలుస్తోంది.

గెలాక్సీ ఎం51 ఫోన్‌లో… ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 730 ప్రాసెస‌ర్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 10, డ్యుయ‌ల్ సిమ్‌, 32 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0.. ఫీచ‌ర్ల‌ను కూడా అందివ్వ‌నున్నార‌ని స‌మాచారం. ఈ ఫోన్ ధ‌ర రూ.20వేల లోపే ఉంటుంద‌ని తెలిసింది. ఇక ఈ ఫోన్‌ను శాంసంగ్ అతి త్వ‌ర‌లోనే విడుద‌ల చేస్తుంద‌ని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news