అద్భుతం.. శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 ఫోన్లు..!

-

ప్ర‌ముఖ ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్ వ‌ర్చువ‌ల్ ఈవెంట్ ద్వారా త‌న నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు గెలాక్సీ నోట్ 20, నోట్ 20 అల్ట్రాల‌ను విడుద‌ల చేసింది. ఈ ఫోన్ల‌లో ప‌లు అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. నోట్ 20 ఫోన్‌లో 6.7 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ ప్ల‌స్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. నోట్ 20 అల్ట్రాలో 6.9 ఇంచుల క్వాడ్‌హెచ్‌డీ ప్ల‌స్ డైన‌మిక్ అమోలెడ్ ఇన్ఫినిటీ-వో డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ఇచ్చారు. అందువ‌ల్ల వీడియోలు, గేమ్స్ చాలా స్మూత్‌గా ర‌న్ అవుతాయి.

samsung launched galaxy note 20 and note 20 ultra smart phones

రెండు ఫోన్ల‌లోనూ స్నాప్‌డ్రాగ‌న్ 865 ప్ల‌స్ అధునాతన ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. అందువ‌ల్ల రెండింటిలోనూ 5జికి సపోర్ట్ ల‌భిస్తుంది. అలాగే రెండింటిలోనూ ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌ను అందిస్తున్నారు. రెండు ఫోన్ల‌లోనూ ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్, అల్ట్రాసోనిక్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, బ్లూటూత్ ఎనేబుల్డ్ ఎస్ పెన్‌, యూఎస్‌బీ టైప్ సి ఫీచ‌ర్ల‌ను కామ‌న్‌గా అందిస్తున్నారు.

శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 స్పెసిఫికేష‌న్లు…

* 6.7 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ ప్ల‌స్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లే
* 2400×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 865 ప్ల‌స్ ప్రాసెస‌ర్‌, 8జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 10, డ్యుయ‌ల్ సిమ్‌, 12, 64, 12 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* 10 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్
* డాల్బీ అట్మోస్‌, అల్ట్రాసోనిక్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్
* బ్లూటూత్ ఎనేబుల్డ్ ఎస్ పెన్‌, 5జి, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, వైఫై 802.11 ఏఎక్స్
* బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ, 4300 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్
* వైర్‌లెస్ చార్జింగ్‌, వైర్‌లెస్ ప‌వ‌ర్‌షేర్

శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా మిస్టిక్ బ్రాంజ్‌, మిస్టిక్ గ్రీన్‌, మిస్టిక్ గ్రే క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఆగ‌స్టు 21 నుంచి ప‌లు ఎంపిక చేసిన దేశాల మార్కెట్ల‌లో ఈ ఫోన్‌ను విక్ర‌యిస్తారు. ఇందుకు గాను ప్రీ ఆర్డ‌ర్లను ఇప్ప‌టికే ప్రారంభించారు.

* గెలాక్సీ నోట్ 20 4జి (8జీబీ + 256జీబీ) ధ‌ర 949 యూరోలు (దాదాపుగా రూ.84,500)
* గెలాక్సీ నోట్ 20 5జి (8జీబీ + 128జీబీ) ధ‌ర 999 డాల‌ర్లు (దాదాపుగా రూ.74,790)
* గెలాక్సీ నోట్ 20 5జి (8జీబీ + 256జీబీ) ధ‌ర 1049 యూరోలు (దాదాపుగా రూ.93,410)

శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా స్పెసిఫికేష‌న్లు…

* 6.9 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ డైన‌మిక్ అమోలెడ్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లే
* 3088 × 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్
* గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 865 ప్ల‌స్ ప్రాసెస‌ర్
* 8/12 జీబీ ర్యామ్‌, 128/256/512 జీబీ స్టోరేజ్‌, 1టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 10, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్
* 108, 12, 12 మెగాపిక్స‌ల్ బ్యాక్‌, 10 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరాలు
* ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, డాల్బీ అట్మోస్‌
* అల్ట్రాసోనిక్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, బ్లూటూత్ ఎనేబుల్డ్ ఎస్ పెన్
* 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, వైఫై 802.11 ఏఎక్స్‌, బ్లూటూత్ 5.0
* ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి
* 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లెస్ చార్జింగ్‌, వైర్‌లెస్ ప‌వ‌ర్‌షేర్

శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ మిస్టిక్ బ్రాంజ్‌, మిస్ట‌క్ బ్లాక్‌, మిస్టిక్ వైట్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఆగ‌స్టు 21 నుంచి ఈ ఫోన్‌ను ఎంపిక చేసిన దేశాల మార్కెట్ల‌లో విక్ర‌యిస్తారు. దీనికి గాను ప్రీ ఆర్డ‌ర్ల‌ను ఇప్ప‌టికే ప్రారంభించారు.

* గెలాక్సీ నోట్ 20 అల్ట్రా 5జి 12జీబీ + 128జీబీ ధ‌ర – 1299 డాల‌ర్లు (దాదాపుగా రూ.97,230)
* గెలాక్సీ నోట్ 20 అల్ట్రా 5జి 12జీబీ + 256జీబీ ధ‌ర – 1299 యూరోలు (దాదాపుగా రూ.1,16,015)
* గెలాక్సీ నోట్ 20 అల్ట్రా 5జి 12జీబీ + 512జీబీ ధ‌ర – 1399 యూరోలు (దాదాపుగా రూ.1,25,860)

కాగా గెలాక్సీ నోట్ 20, నోట్ 20 అల్ట్రా ఫోన్ల‌ను భార‌త మార్కెట్‌లో ఎప్పుడు విడుద‌ల చేసేదీ.. శాంసంగ్ ఇంకా వెల్ల‌డించ‌లేదు.

Read more RELATED
Recommended to you

Latest news