హెచ్ఆర్ఎ, సీసీఎ రద్దు చేసే హక్కు మీకుందా..? : బొప్పరాజు వార్నింగ్

-

హెచ్ఆర్ఎ, సీసీఎ రద్దు చేసే హక్కు మీకుందా..? అని ప్రభుత్వానికి వార్నింగ్‌ ఇచ్చారు పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు. ఉద్యోగ సంఘాలన్నింటినీ ఒకే వేదిక పైకి తెచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మనం ప్రభుత్వాన్ని దూషిస్తున్నారని ప్రభుత్వం దుర్మార్గంగా అంటోందని.. ఉద్యోగుల ఉద్యమాన్ని తిప్పికొట్టాలని వైసీపీ నేతలకు పిలుపునిచ్చారని చెప్పారు.

ప్రభుత్వం చేప్పేదానికి చేసేదానికి సంబంధం లేకపోవడం వల్లే ఉద్యమంలోకి వచ్చామని.. అభిప్రాయబేధాలు పక్కనపెట్టి నాలుగు సంఘాలు ఒకటై ఉద్యమం చేస్తున్నాయన్నారు. మేం యుద్దం ప్రకటించారని ప్రభుత్వం అనుకుంటోంది.. ఉద్యోగుల్ని శత్రువుల్లాగా చూస్తున్నారని.. మేం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులం ..సంక్షేమ పథకాలు వెళ్లాలంటే మేమే చేయాలని వెల్లడించారు. పీఆర్సీపై అశుతోష్ కమిటీ నివేదికను బయటపెట్టాలని.. చీకటి జీవో లు విడుదల చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మాది ధర్మ పోరాటం అని ప్రజలందరికీ తెలుసని.. మేం ప్రజల్లో భాగమే.. మాపై ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా దుష్ర్పచారం చేస్తున్నారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news