డైరెక్టర్ ప్రశాంత్ వర్మను పొగడ్తలతో ముంచెత్తిన సంగీతం శ్రీనివాసరావు..

-

డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై ప్రశంసలు కురిపించారు లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. ఇటీవల విడుదలైన హనుమాన్ టీజర్ చూసిన ఆయన.. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయన్నారు. యానిమేషన్ విజువల్స్, కెమెరా పనితనం అద్భుతంగా ఉన్నాయని.. టీజర్ ఆరంభంలో భారీ హనుమంతుడి విగ్రహాన్ని చూస్తుంటే.. నిజంగానే ఆయన్ని చూస్తున్నామా అనిపించేలా ఉందని.. భక్తిభావం కలుగుతుందని అన్నారు.. ఈ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు హ్యాట్సాఫ్ అంటూ పొగిడారు. ఇక హనుమాన్ టీజర్ వీక్షించిన కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ సైతం ఫిదా అయ్యారు. పనితనం బాగుందని.. హనుమాన్ టీజర్.. మాసీ.. క్లాసీ అని.. ఫాంటసీ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. తేజా సజ్జా.. అమ్రిత సూపర్ వర్క్ అంటూ ట్వీట్ చేశారు.

ఇక టీజర్ విషయానికి వస్తే.. ఒక అద్భుతమైన జలపాతాన్ని చూపిస్తూ టీజర్ ప్రారంభమైయింది. జలపాతంకు ఆనుకొని చేతిలో గదతో భారీ హనుమాన్ విగ్రహం కూడా దర్శనమిస్తోంది. నేపథ్యంలో శ్రీరామ నామం వినిపించింది. కొన్ని జీవురాశులు కొండపై ఒక కాంతిపుంజం చుట్టూ ప్రదక్షణం చేయడం ‘సుప్రీమ్ బీయింగ్’ రాకను సూచిస్తుంది. సముద్రం ఒడ్డున అపస్మారక స్థితిలో ఉన్నట్లుగా తేజ సజ్జా ఎంట్రీ ఇచ్చాడు. అమృత అయ్యర్ భయపడుతూ చూడటం సూర్యగ్రహణం చెడు యొక్క ఆగమనాన్ని సూచిస్తుంది. వినయ్ రాయ్ ‘మ్యాన్ ఆఫ్ డూమ్’ గా భయపెట్టాడు. వరలక్ష్మి శరత్‌కుమార్ కొబ్బరిగెలతో విలన్స్ ని కొట్టే పెళ్లికూతురుగా ఎంట్రీ ఇచ్చింది. హనుమంతు అండర్‌ డాగ్‌ నుంచి సూపర్‌హీరోగా మారడం విజువల్ వండర్ గా వుంది. గద పట్టుకుని, కొండపై నిలబడి, హెలికాప్టర్‌ సమీపిస్తుండగా ఆకాశంలో ఎగురుతూ తన అతీత శక్తులను చూపిస్తూ.. హనుమంతుడు ఆవహించినట్లు కనిపిస్తోంది. హనుమ తపస్సు చేస్తూ, రామ నామం జపిస్తున్న చివరి విజువల్స్ మనసులో నాటుకునేలా వున్నాయి. ప్రశాంత్ వర్మ,అతని టీం మాస్టర్ వర్క్ ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. 121 సెకన్ల టీజర్ విజువల్ వండర్ గా అంజనాద్రి ప్రపంచంలోకి తీసుకెళ్లింది.

Read more RELATED
Recommended to you

Latest news