తెలుగు సినీ ప్రేక్షకులకు అలనాటి హీరోయిన్ సంగీత అంటే సుపరిచితమే. ఈమె కొన్ని సినిమాలలో సైడ్ క్యారెక్టర్ గా నటించి, మరికొన్ని సినిమాలలో విలన్ గా కూడా నటించింది. ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షో లకు కూడా ఈమె జడ్జిగా వ్యవహరిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఈమధ్య సరిలేరు నీకెవరు చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు సంగీత. తాజాగా ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో పాల్గొన్న ఈమె..తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సంగీత మాట్లాడుతూ.. తాను చిన్న వయసు నుండి చాలా లావుగా ఉన్నదట. అంతేకాకుండా తనకి చర్మానికి సంబంధించిన పలు సమస్యలు కూడా ఉన్నవి అని తెలియజేసింది.. ముఖ్యంగా ఏదైనా బంగారు నగలను ధరించాలి అంటే తనకు అలర్జీ వస్తుందట. చర్మం ఎర్రగా మారిపోయి , దద్దుర్లు రావడమే కాకుండా మంటగా అనిపించేది అని సంగీత తెలిపింది. ఇక ఒకానొక సమయంలో అనుకోకుండా బరువు పెరగవలసి వచ్చింది అని తెలియజేసింది. ఇండస్ట్రీలో ఎవరితో కూడా ఎక్కువగా కలిసిపోయే దానిని కాదని.. అందువల్లే తనతో ఎవరు సరిగ్గా మాట్లాడే వారు కాదని తెలియజేసింది సంగీత. అయితే ఆ తర్వాత సంగీతకు తెలిసింది ఏమిటంటే అందరితో కలిసి ఉంటే సినిమా అవకాశాలు వస్తాయని.. అందువల్లే తనకి సినీ అవకాశాలు చాలా తక్కువగా వచ్చాయి అని తెలియజేసింది.
ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో తనని హీరోయిన్గా పనికిరానని చాలామంది తనని అవమానించారట. ఇక దాంతో తను హీరోయిన్ గా చేయలేనని తన తల్లితో చెప్పేసి సినిమాలు మానేద్దామనుకుందట. కానీ కొన్ని కారణాల చేత నటించాల్సి వచ్చింది అని తెలియజేసింది సంగీత. అయితే అలాంటి విషయాలను రానురాను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లడమే తనకు మంచిదనిపించింది అని అలా ఎన్నో సినిమాలలో నటించానని తెలిపింది సంగీత. ప్రస్తుతం సంగీత చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.