ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్రారెడ్డి, బినోయ్‌బాబు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది సిబిఐ ప్రత్యేక కోర్టు. డిసెంబర్ 19 వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది. ఈరోజుతో శరత్ చంద్రారెడ్డి, బినోయ్‌బాబు జ్యూడిషియల్ రిమాండ్ గడువు ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిందితులను కోర్టులో హాజరుపరిచారు అధికారులు. కేసును విచారిస్తున్న న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ సెలవులో ఉన్నందున శరద్ చంద్రారెడ్డి,బినోయ్ బాబును మరో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు అధికారులు.
అయితే బెయిల్ మంజూరు చేయాలని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు శరత్ చంద్రారెడ్డి. శరత్ చంద్రారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సమాధానం చెప్పాలని దర్యాప్తు సంస్థకు నోటీసులు ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. దీంతో డిసెంబర్ 13న మధ్యాహ్నం 2 గంటలకు శరత్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టనుంది ప్రత్యేక కోర్టు. శరద్ చంద్రారెడ్డిపై విచారణ పెండింగ్‌లో ఉందని ఇంకా చార్జిషీట్ దాఖలు చేయలేదని కోర్టుకు తెలిపింది ఈడీ. తదుపరి విచారణను డిసెంబర్ 13కి వాయిదా వేసింది.