అదరగొట్టే పాత్ర చేయబోతున్న కృతిశెట్టి..!!

-

అందాల ముద్దుగుమ్మ కృతిశెట్టి ప్రస్తుతం తన అందంతో కుర్ర కారు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. పరిచయం అయిన ఉప్పెన సినిమా తోనే సంచలన విజయం అందుకుంది. అక్కడి నుండి వరస హిట్స్ తో స్థానం పదిలం చేసుకుంది. మళ్లీ వరస ప్లాప్ లతో గోల్డెన్ లెగ్ కాస్తా ఐరన్ లెగ్ మాదిరిగా అయ్యింది. అయినాసరే అమ్మడి ఖాతాలో చాలా సినిమాలు ఉన్నాయి. ఇక ఈమెకి రీసెంట్ గా మరో మంచి ఆఫర్ వచ్చి నట్లు తెలుస్తోంది.

విజయ్ దేవర కొండ తో సమంత చేస్తున్న  ఖుషి సినిమా షూటింగ్ కూడా కొంత బాగం పూర్తి అయ్యింది. ఇంకొంత భాగం పెండింగ్ లో వుంది. ఇప్పుడు సమంత హాస్పిటల్ లో వుండడం విజయ్ ను నిర్మాతలను తెగ కంగారు పెడుతోంది.కాని సమంత ఆరోగ్య పరిస్తతి బాగుపడక పోతే ఈ సినిమా పరిస్తితి తలకిందులు అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం షూటింగ్‌కి బ్రేక్‌ పడింది. ఇదిలా ఉండగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో సమంతతో పాటు మరో హీరోయిన్‌గా కృతిశెట్టికి అవకాశం దక్కిందట.

ఒక కీలకమైన పాత్ర కోసం కృతిశెట్టి ని సంప్రదించారట. ఆ సినిమాకు మలుపు తిప్పే పాత్ర అవుతుందని సమాచారం.నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న ఈ రోల్‌ సినిమా చివర్లో చాలా ఎమోషనల్‌గా మారుతుందని, ఈ పాత్రలో కృతిశెట్టి నటించనున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. ఇలాంటి పాత్ర ఇంత చిన్న ఏజ్ లో రావటం అదృష్టం అని చాలా మంది భావిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news