ఎమ్మెల్యే రాజయ్యే వల్లే సర్పంచ్ అయ్యా : సర్పంచ్ నవ్య

-

తనపై ఆరోపణలు చేసిన జానకీపురం గ్రామ సర్పంచ్ నవ్యను కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య. నేరుగా రాజయ్య ఆమె ఇంటికి వెళ్లి మాట్లాడారు. అధిష్టానం నిర్ణయం మేరకు, నవ్య భర్త ప్రవీణ్ అహ్వానం మేరకు తాను ఇక్కడికి వచ్చినట్టుగా రాజయ్య అన్నారు. గత నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగింకగా వేధిస్తున్నాడంటూ నవ్య ఆరోపించారు. ఈ క్రమంలో నవ్య ఆరోపణలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ వేధింపుల ఆరోపణలపై విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే సర్పంచ్ నవ్య, ఎమ్మెల్యే రాజయ్యే వల్లే తనకు టికెట్ వచ్చిందని, సర్పంచ్ అయ్యానని అనడం కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

తమ గ్రామాన్ని ఎమ్మెల్యే దత్తత తీసుకున్నారని, కానీ ఆయన వల్ల గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు నవ్. తన గ్రామానికి ఎలాంటి అభివృద్ధి చేస్తారో ఎమ్మెల్యే రాజయ్య మీడియా ముఖంగా చెప్పాలని అడిగారు. మహిళలకు అడుగడుగునా అన్యాయం జరుగుతుందని నవ్య వెల్లడించారు. తప్పు చేసిన వారిని క్షమిస్తానని అన్నారు నవ్య. అయితే ఆమె రాజయ్య వేధింపులపై మాత్రం నేరుగా స్పందించలేదు. కానీ రాజయ్య పక్కన ఉండగానే ఆయనపై నవ్య తీవ్ర ఆరోపణలు చేశారు. తాను చేసిన ప్రతి ఆరోపణ నిజం అని స్పష్ట పరిచారు నవ్య.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version