దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ సిటిజన్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఇక వాళ్ళ కోసం ప్రత్యేకంగా కొత్త పెన్షన్ సేవలను తీసుకు వచ్చింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. సేవలు పొందాలనుకునే సీనియర్ సిటిజన్ కస్టమర్లు ముందుగా అవసరమైన సమాచారంతో పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న కస్టమర్లు ఈ సేవలను సులభంగా పొందవచ్చని ఎస్బీఐ తాజాగా ఓ ట్వీట్ చేసింది.
ఇక పోర్టల్ వివరాల లోకి వెళితే .. ఈ కొత్త పెన్షన్ సేవల కోసం ప్రత్యేకంగా https://www.ptensionseva.sbi పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. వివిధ రకాల సేవలను ఖాతాదారులు దీనితో పొందొచ్చు. దీని ద్వారా బకాయిల లెక్కింపు షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం, పెన్షన్ స్లిప్ లేదా ఫారం -16ని డౌన్‌లోడ్ చేసుకోవడం లాంటివి అవుతుంది. అదే విధంగా మరెన్నో సేవలని ఈజీగా పొందొచ్చు. ఫోన్లో పెన్షన్ చెల్లింపు వివరాలకు సంబంధించిన అలర్ట్‌లను కూడా పొందొచ్చు.
ఒక్కసారి రిజిస్టర్ చేసుకుంటే చాలు ప్రతినెలా మీ పెన్షన్ స్లిప్‌ను నేరుగా రిజిస్టర్డ్ ఈ–మెయిల్ కి వస్తుంది. ఒకవేళ కనుక రిజిస్టర్ చేసిన తర్వాత ఏదైనా సమస్యలు వస్తే support.pensionseva@sbi.co.in కు ఈ–మెయిల్ చేయవచ్చు. లేదంటే ‘SMS UNHAPPY’ అని టైప్ చేసి 8008202020 నెంబర్‌కు SMS చేసి సమస్యని పరిష్కరించుకోచ్చు. లేదు అంటే 18004253800/1800112211, 08026599990 టోల్‌ఫ్రీ నెంబర్ల కు కాల్ చేసి కూడా చెప్పచ్చు.