చాలా మంది ముఖం మీద పింపుల్స్ ఉంటాయి. అదే విధంగా ఎక్కువగా మచ్చలు కూడా ఉంటాయి. వాళ్ళు అనేక ప్రయత్నాలు చేసి ఉంటారు. కానీ ఒక్కొక్క సారి ఫలితం కనిపించకపోవచ్చు. మీ ముఖంపై కూడా మచ్చలు ఉన్నాయా…? వాటిని తొలగించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారా..? అయితే మీరు కచ్చితంగా ఈ టిప్స్ ని పాటించాలి.
వీటిని కనుక అనుసరించారు అంటే ముఖంపై మచ్చలు మాయమైపోతాయి. మరి ఆలస్యమెందుకు ఈ చిట్కాల కోసం ఇప్పుడే చూసేయండి.
కమల తొక్కలు:
కమల తొక్కలలో అందాన్ని పెంపొందించే గుణాలు ఉన్నాయి. అదే విధంగా ఇది మచ్చలు వంటి వాటిని సులువుగా తొలగిస్తుంది. దీనిలో ఉండే సిట్రిక్ యాసిడ్ పింపుల్స్, మచ్చలను తొలగిస్తుంది. అయితే దీని కోసం మీరు ముందుగా ఒక టీ స్పూన్ తమల తొక్కల పొడి తీసుకోండి.
దానిలో ఒక టీస్పూన్ తేనే కలిపి పేస్టులాగ చేసి ముఖం మీద పట్టించండి. పది నుండి పదిహేను నిమిషాల పాటు అలాగే వదిలేసి తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. రెగ్యులర్ గా మీరు ఈ పద్ధతిని అనుసరించవచ్చు. ఇలా మచ్చలు ఈజీగా మచ్చలు పోతాయి.
శనగపిండి:
శనగపిండి లో కూడా మంచి గుణాలు ఉన్నాయి. పింపుల్స్, మచ్చలు తొలగించటానికి బాగా ఉపయోగపడుతుంది. 1 స్పూన్ శనగపిండి లో కొద్దిగా రోజ్ వాటర్, నిమ్మ రసం వేసి పేస్ట్ లాగ చేసి మచ్చల మీద అప్లై చేయండి.
కాసేపు దానిని అలా వదిలేసి నీటితో ముఖాన్ని శుభ్రంగా కడిగేసుకోండి. ఈ పద్ధతిని కూడా మీరు రెగ్యులర్ గా పాటిస్తూ ఉంటే మచ్చలు పూర్తిగా మాయం అయిపోతాయి.
బేకింగ్ సోడా:
మచ్చలని పోగొట్టడానికి బేకింగ్ సోడా కూడా బాగా ఉపయోగపడుతుంది. దీని కోసం మీరు 2 టీ స్పూన్లు బేకింగ్ సోడాని, 1 స్పూన్ నీళ్లలో వేసి పేస్టులాగ చేసి ముఖానికి అప్లై చేయండి. ఆరిపోయిన తర్వాత ముఖాన్ని కడిగేసుకుంటే మంచి ఫలితాలు కనబడతాయి.