షెజ్వాన్ వెజ్జీస్ బ్రౌన్ రైస్ రెసిపీ..!

-

బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే బ్రౌన్ రైస్ తో కేవలం అన్నం మాత్రమే కాకుండా వివిధ రకాల రెసిపీస్ ని మనం తయారు చేసుకోవచ్చు. పైగా ఈ రెసిపీస్ చేసుకోవడం చాలా సులువు కూడా. అయితే మరి ఇక ఆలస్యం ఎందుకు ఈ రెసిపీస్ గురించి ఇప్పుడు చూద్దాం.

 

brown-rice

కావలసిన పదార్థాలు:

అర కప్పు బ్రౌన్ రైస్ (ఉడికించి పెట్టుకున్నది)
రెండు నుండి మూడు టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్
ఒక కప్పు కూరగాయ ముక్కలు (క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్)
నూనె
మిరియాల పొడి
ఉప్పు రుచికి సరిపడా
షెజ్వాన్  సాస్

ప్రిపరేషన్ సమయం: 15 నిమిషాలు
కుకింగ్ సమయం: పది నుండి పదిహేను నిమిషాలు

తయారు చేసుకునే పద్ధతి:

ముందుగా పాన్ పెట్టి అందులో నూనె వేసి.. నూనె వేడెక్కిన తర్వాత కూరగాయల అన్నింటినీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అందులో ఉప్పు, మిరియాల పొడి, రెడ్ చిల్లీ సాస్, షెజ్వాన్ సాస్ వేసుకుని బాగా
ఫ్రై అయిన తర్వాత అందులో అన్నం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే రెసిపీని ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. రైతా తో కానీ నచ్చిన కర్రీ తో కానీ సర్వ్ చేసుకుంటే బాగుంటుంది.

బ్రౌన్ రైస్, వైట్ రైస్.. రెండింటిలో ఏది మంచిదంటే…!  డయాబెటిస్ ఉన్నవారు బ్రౌన్ రైస్ ను తినవ‌చ్చా ? ఇలా ఈజీగా మష్రూమ్ బ్రౌన్ రైస్ తయారుచేసుకోండి..!

 

Read more RELATED
Recommended to you

Latest news