కేరళ: విజృంభిస్తున్న కరోనా.. నవంబరు 1నుండి పాఠశాలలు ప్రారంభం.

దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. మొదటి వేవ్ తతో పోల్చితే రెండవ వేవ్ నానా భీభత్సం సృష్టించింది. ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభణ బాగా తగ్గింది. ఐతే ఒక్క కేరళలో మాత్రం కరోనా వ్యాప్తి అంతగా తగ్గలేదు. ఒక్క కేరళలోనే కరోనా వ్యాప్తి విపరీతంగా ఉంది. దాంతో ఆ రాష్ట్రం కరోనా నిబంధనల మధ నలుగుతుంది. ఐతే ఈ నిబంధనలు సడలించే ప్రయత్నం చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం కేరళలో పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.

కరోనా కేసులు వేలల్లో వస్తున్నప్పటికీ పాఠశాలలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ నిర్ణయం తీసుకున్నారు. నవంబరు 1వ తేదీ నుండి 1నుండి 12వ తరగతి విద్యార్థులకు పాఠశాలలు తెరుచుకోనున్నాయి. మిగతా వారికి మరికొన్ని రోజుల తర్వాత ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. నవంబరు 1వ తేదీ అంటే ఇంకో నెల రోజులు ఉంది. అప్పటి వరకు కరోనా వ్యాప్తి ఇప్పుడున్నంత లేకపోతే విద్యార్థులు పాఠశాలలకు వచ్చే అవకాశం ఉంది.