సైన్స్ కు అందని వింత సమస్య..ఇదేలా సాధ్యం?

-

ప్రపంచంలో ఏదైనా వింత జరిగితే దాని గురించి పూర్తీ విషయాలను..పుట్టు, పూర్వత్రాలను సైన్స్ ద్వారా తెలుసుకుంటారు.ప్రపంచ వ్యాప్తంగా అనేక అద్భుతాలు, అంతుచిక్కని రహాస్యాలు నిండి ఉన్నాయి. వేరే గ్రహాలతో పోలిస్తే భూమిద ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. అలాంటిది కొన్ని విషయాలు సైన్స్ కు కూడా అందనివి ఉన్నాయని అంటున్నారు. ఇక విషయానికొస్తే..ఓ దేశంలో సైన్స్ కు అందని రీతిలో అందరు అమ్మాయిలే పుడుతున్నారు.అది కూడా ఒకటి, రెండు ఏళ్లు కాదు గత 12 ఏళ్ళుగా ఇలానే అమ్మాయిలు పుడుతున్నారు.

ఈ ఘటన పోలాండ్ లో వెలుగు చూసింది.ఓ పల్లెటూరు సైన్స్‌కే సవాల్‌ విసురుతోంది. ఆ ఊర్లో మగపిల్లలు పుట్టరు. ఎవరైనా మహిళ గర్భం దాల్చితే వారి కడుపులో ఆడపిల్లలు మాత్రమే పుడతారు. ఒకటి కాదు, రెండు కాదు..గత పుష్కరకాలంగా ఇదే జరుగుతోంది. ఈ పన్నెండేళ్లలో ఒక్క మగపిల్లవాడు కూడా పుట్టలేదు. దీనికి కారణం ఏంటన్నది ఇప్పటి వరకు ఎవరికీ తెలియలేదు.. కానీ, ఇది పూర్తిగా నిజం. శాస్త్రవేత్తలు కూడా ఈ మిస్టరీని చేధించలేకపోయారు. ఈ మిస్టరీ విలేజ్‌ పోలాండ్‌ దేశంలో ఉంది. ఆ ఊరి పేరు మిజెస్కే ఓడ్ర్జెన్స్కీ.

దాదాపు పన్నెండు ఏళ్ళుగా ఆ ప్రాంతంలో అమ్మాయిలు మాత్రమే పుడుతున్నారు.దీంతో ఆ ఊరి మేయర్‌ ఓ కీలక ప్రకటన చేశారు. 2019 వ సంవత్సరంలో ఆ ఊరి మేయర్ చేసిన ప్రకటన మేరకు…ఎవరికైనా మగ సంతానం కలిగితే భారీ పారితోషికం ఇస్తామని ప్రకటించారు. కానీ, ఒక్కరికి కూడా మగ సంతానం కలుగకపోవడంతో ఒక్కరు కూడా ఈ రివార్డ్ ను తీసుకోలేకపోయారు. పైగా, 12 ఏళ్లుగా అక్కడ మగపిల్లలు ఎందుకు పుట్టడంలేదన్నది అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది.కానీ సైంటిస్ట్స్ మాత్రమే ఈ వింతకు కారణం ఏంటనే విషయాన్ని త్వరలోనే చేధిస్తామని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news