అస్సాంలో వరద బీభత్సం.. చిక్కుకున్న 14మంది ప్రయాణికులు

-

అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 15 రెవెన్యూ సర్కిళ్లలోని దాదాపు 222 గ్రామాలు వరదల్లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. 10321.44 హెక్టార్ల పంట నీట మునిగినట్లు, ఓ చిన్నారి సహా ముగ్గురు వ్యక్తులు మరిణించినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే, 1,434 జంతువులు కూడా వరద బారినపడ్డాయని, 202 ఇళ్లు ధ్వంసమయ్యాయని, మొత్తంగా 57 వేల మందిపై వరదల ప్రభావం పడిందని అధికారుల అంచనా వేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ, పారా మిలటరీ దళాలు, ఎస్‌డీఆర్ఎఫ్, అగ్నిమాపక, అత్యవసర సేవల సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.

Assam floods: Incessant rain affect train services, 119 passengers have  been airlifted

పలు జిల్లాల్లోని రోడ్లు, బ్రిడ్జిలు, కాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నిరంతరాయంగా కురుస్తున్న వానలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో రైల్వే ట్రాకులు, వంతెనలు దెబ్బతిన్నాయి. రోడ్డు రవాణా స్తంభించిపోయింది. వరదల నేపథ్యంలో నార్త్‌ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. ఇప్పటికే బయలుదేరిన రెండు రైళ్లు వరదల్లో చిక్కుకున్నాయి. ఒక్కో దాంట్లో 1400 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ఎయిర్‌ఫోర్స్ సాయంతో ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. డిటోక్‌చెర్రా స్టేషన్‌లో 1,245 మంది ప్రయాణికులు చిక్కుకుపోవడంతో.. వారిని బదార్‌పూర్, సిల్చర్ రైల్వే స్టేషన్లకు తరలించారు. అలాగే, 119 మంది ప్రయాణికులను భారత వైమానిక దళం సిల్చర్‌కు తరలించింది. చిక్కుకుపోయిన ప్రయాణికులకు ఆహారం, తాగు నీరు సరఫరా చేస్తున్నట్టు రైల్వేశాఖ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news