షాకింగ్‌ ; ఈ పాము విషంతో కరోనా కు చెక్‌ !

చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కరోనా మహమ్మారి కారణంగా చాలా దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్‌ వచ్చింది. అయితే.. ఈ వ్యాక్సిన్‌ వేసుకున్నప్పటికీ కరోనా సోకుతుండటంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యం లోనే కరోనా తో భయపడే వారికి శుభవార్త చెప్పారు బ్రెజిల్‌ శాస్త్రవేత్తలు. ఈ కరోనా మహమ్మారికి విరుగుడును కనిపెట్టారు.

కరోనా కు చికిత్స కనిపెట్టాలని ఈ బ్రెజిల్‌ శాస్త్రవేత్తలు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యం లోనే వివిధ పాముల రకాల జాతుల నుంచి విషాన్ని సేకరించి రీసెర్చ్‌ మొదలు పెట్టారు. అయితే.. ”జరరాకుచు పిట్‌ వైపర్‌” అనే జాతి పాము లో ఉన్న ఒక అణువు మరియు కోతిలో ఉన్నటు వంటి కొన్ని కణాలు కలపడం ద్వారా… వ్యాక్సిన్‌ కంటే పవర్‌ ఫుల్‌ మందు తయారవుతుందని బ్రెజిల్‌ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఈ మందు… కరోనా వైరస్‌ ను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని కనిపెట్టారు బ్రెజిల్‌ శాస్త్రవేత్తలు. ప్రస్తుతం దీనిపై ఇంకా పరిశోధనలు జరుగుతుండగా… త్వరలోనే ఈ మందు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.