వణికిస్తున్న స్క్రబ్ టైఫస్ వైరస్… ఆ పురుగులతో తస్మాత్ జాగ్రత్త..!

-

ఇప్పటికే ఒమీక్రాన్ వైరస్ తో సతమతమౌతుంటే ఇప్పుడూ స్క్రబ్ టైఫస్ కేసులు కూడా నమోదు అవుతున్నాయి. వినడానికి వింతగా ఉన్నా ఈ వైరస్ ఇప్పుడు జనాన్ని వణికిస్తోంది. ఈ స్క్రబ్ టైఫస్ వైరస్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

అసలు ఈ వైరస్ అనేది పురుగు కుట్టడం వల్ల వస్తుంది. మన ఇళ్లలో ఉండే మంచాలు, తడిగా ఉండే ప్రాంతాలలో ఈ పురుగులు సంచరిస్తూ ఉంటాయి. చూడడానికి ఈ పురుగులు అచ్చం నల్లి మాదిరి ఉంటాయి. రాత్రివేళల్లో ఎక్కువగా ఇవి మనకి కనపడతాయి.

ఎలాంటి లక్షణాలు కనబడతాయి..?

జ్వరం
ఒళ్ళు నొప్పులు
కండరాల నొప్పులు
ఒంటిపై దద్దుర్లు

ఒకవేళ కనుక ఈ లక్షణాలు ఉంటే చికిత్స తీసుకోవాలని వైద్యులు చెప్పడం జరిగింది. ఈ వ్యాధి ఇప్పుడు అందర్నీ తెగ టెన్షన్ పెడుతోంది. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో 15 మందికి పైగా ఈ వైరస్ బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఎక్కువ మంది వీరిలో పిల్లలే ఉన్నారు.

ఒకవేళ కనుక జ్వరం, ఒళ్లు నొప్పులు వచ్చాయంటే నిర్లక్ష్యం చేయకండి. డాక్టర్లు కూడా నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరిస్తున్నారు. ఒక చిన్న పురుగు కుడితే ఈ వ్యాధి సోకుతుందని గ్రహించి.. మీ ఇల్లుని శుభ్రంగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోండి. అలానే ఈ పురుగులు కుట్టకుండా చూసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news