గేదెకు ప్రపోజ్ చేశాడు.. అది ఇచ్చిన రిప్లేకి ఫ్యూజులు ఎగిరిపోయాయి..

-

సరదాగా ఎన్నో చిలిపి పనులు చేస్తూ ఉంటారు యువకులు..అయితే అవి కేవలం సరదా వరకే ఉండాలి..శ్రుతి మించితే మాత్రం దూల తీరిపోతుంది.ప్రాణాలు పోయే ప్రమాదాలు కూడా జరగవచ్చు.ముఖ్యంగా జంతువుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.చాలా మంది జంతువులు కనబడితే ఏదోలా ఆటపట్టిదాం అనుకుంటారు. ఒక్కోసారి అవి ఇచ్చే రిప్లై చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవడం ఖాయం. ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేసేటప్పుడు ఎన్నో ప్లాన్స్ వేసుకుంటారు…

వాటికి ఒకే చెప్తే సరే కానీ లేకుంటే మాత్రం సీన్ సితార అవ్వడం ఖాయం..ఎన్నో ఆలోచనలు చేసుకుని.. చివరికి ధైర్యం చేసి మొత్తం మీద ప్రపోజ్ చేయడానికి సిద్ధమవుతాం. కొంతమంది అయితే ముందు ఎన్నో ట్రయల్స్ కూడా వేస్తాం. పక్కన ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే మన ఫర్మార్మెన్స్ తో చివరకు చిరాకు కూడా తెప్పిస్తాం. కాని.. ఓ బాలుడు గేదెకు ప్రపోజ్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈవీడియో చూస్తున్న నెటిజన్లంతా నవ్వును ఆపుకోలేకపోతున్నారు.

ఈ వీడియోను చూసిన వారంతా నవ్వకుండా ఉండలేరు.వీడియోలో ఓ బాలుగు గేదెకు ప్రపోజ్ చేస్తూ కనిపించాడు. ఇందులో ఆ గేదె రియాక్షన్ చూసి అందరూ నవ్వుకుంటున్నారు. ఈ వైరల్ వీడియోలో పచ్చని పొలంలో ఆ బాలుడు గేదెకు ప్రపోజ్ చేయడం కనిపిస్తుంది. మోకాళ్ళు దించి, గేదెకు ఓ గడ్డి బొకే ఇచ్చి ప్రపోజ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అతన్ని చూడగానే ఈ గేదె ఎలాంటి రియాక్షన్ ఇవ్వదు. తర్వాత ఆ బాలుడు గేదె ముందు డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. బాలుడి డ్యాన్స్ చూసిన గేదె ఆ అక్కడి నుండి తరిమింది. దీంతో బాలుడు అక్కడి నుండి ఒకటే పరుగు. భయంతో వెనక్కి తిరిగి చూసుకోకుండా పరిగెత్తాడు..ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.. మీరు ఓ పారి చూసేయ్యండి..

Read more RELATED
Recommended to you

Latest news