ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఎనిమిది మంది కూలీలు దుర్మరణం

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిర్ణయాలు మరియు నిబంధనలు అమలు చేసినప్పటికీ ని…. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య మాత్రం తగ్గటం లేదు. నిర్లక్ష్యం మరియు ఓవర్ స్పీడ్ కారణంగా వివిధ ప్రాంతాల్లో అనేక రకమైన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక తాజాగా… కర్ణాటక లోని చిక్బల్లాపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో జీపులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. దినసరి కూలీలతో వెళ్తున్న జీను చింతామణి సమీపంలోని… మర నాయక హాళ్లి వద్ద ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.

ఈ ఘోర ప్రమాదం లో… ఎనిమిది మంది కూలీలు మృతి చెందగా… ఇద్దరు మహిళలు ఉన్నారని సమాచారం అందుతోంది. ఇక చెందిన వారంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వారంతా కూలీలనీ…పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వెల్తున్నసమయంలో ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు పోలీసులు. ఇక ఈ ప్రమాదంలో గాయపడిన వారికి… స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం అందుతోంది.