సీతారామం మూవీ రివ్యూ: ఓ చక్కటి ప్రేమ కథ..

-

సినిమా:  సీతా రామం

నటీనటులు: దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్ – రష్మిక మందన్న – సుమంత్ – గౌతమ్ మీనన్ – ప్రకాష్ రాజ్ – భూమికా చావ్లా – తరుణ్ భాస్కర్ – శత్రు – సచిన్ ఖేడేకర్ – మురళీ శర్మ – వెన్నెల కిషోర్ తదితరులు..

సంగీతం:  విశాల్ చంద్రశేఖర్

ఛాయాగ్రహణం: పీఎస్ వినోద్ – శ్రేయాస్ కృష్ణ

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

నిర్మాతలు: స్వప్న సినిమాస్

సమర్పణ: వైజయంతీ మూవీస్

కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: హను రాఘవపూడి

ఇటీవల కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి బాగా తగ్గిపోయింది. ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. డబ్బింగ్ చిత్రాలకు వచ్చిన కలెక్షన్స్ కూడా తెలుగు సినిమాలకు రాకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్లలోకి రాబోతున్న ”సీతా రామం” సినిమాపై అందరి దృష్టి పడింది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయ్యింది..మరీ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చుద్దాము..

కథ,విశ్లేషణ:

ఈ సినిమా మంచి కథనంతో రూపొందింది..1985 ప్రాంతం నాటి కథ..పాకిస్తాన్ మేజర్ అయిన తారిఖ్ తన మనవరాలు అఫ్రీన్( రష్మిక మందాన)కి ఓ బాధ్యత అప్పజెబుతాడు. ఇండియాకు చెందిన మహాలక్ష్మి(మృణాళి ఠాగూర్) ఎక్కడుందో కనుక్కొని ఆమెకు ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ రామ్(దుల్కర్ సల్మాన్) 20 ఏళ్ల క్రితం రాసిన లెటర్ అందజేయాలని చెబుతాడు. మహాలక్ష్మి కోసం అఫ్రీన్ అనేక పాట్లు పడుతుంది. అయితే లెఫ్టినెంట్ రామ్, మహాలక్ష్మికి పరిచయమే లేకపోగా, ఇద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది వంటి విషయాల పై సినిమా కథ ఉంటుంది..పీరియాడికల్ డ్రామాగా సీతారామం చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించాడు. అయితే సస్పెన్స్ చివరి వరకు క్యారీ చేయగలిగిన కొన్ని రిపీటెడ్ సన్నివేశాలు ప్రేక్షకులకి వినోదాన్ని పంచలేకపోయాయి. రన్‌టైమ్ ఓ పదిహేను నిమిషాలు తగ్గించి ఉంటే బాగుండేది. ఈ చిత్రం ప్రేక్షకులని ఎంగేజ్ చేయగలుగుతుంది కాని అంతగా ఆకట్టుకోలేదని పబ్లిక్ అంటున్నారు.

సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం రొమాన్స్, సస్పెన్సు, హ్యూమర్ తో నడిపించాడు హను రాఘవపూడి. విజువల్స్ గురించి కూడా ప్రేక్షకులు గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఆకట్టుకునే రొమాంటిక్ సన్నివేశాలతో పాటు, సస్పెన్సు ప్రేక్షకుల మదిలో క్యారీ అయ్యేలా దర్శకుడు చేయగలిగాడు. మెల్లగా సాగే కథనం ఒకింత నిరాశపరిచే అంశం. ఎమోషనల్ లవ్ స్టోరీ చెప్పే క్రమంలో హను అక్కడక్కడా నిరాశకు గురి చేశారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. పాటలైనా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయినా విశాల్ న్యాయం చేశాడు..కెమరామెన్ అద్భుతంగా సినిమాను చూపించాడు..ఎడిటింగ్ కూడా బాగానే ఉంది..
ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ కూడా పోటీ పడ్డారు..దుల్కర్, మృణాల్ సినిమా మొత్తాన్ని తమ భుజాలపై వేసుకొని నడిపించారు. తరుణ్ భాస్కర్, సుమంత్ తమ పాత్రకు న్యాయం చేశారు. సునీల్ మరియు వెన్నెల కిషోర్ కామెడీ పాత్రల్లో చక్కటి నవ్వులు పూయించారు. సపోర్టింగ్ క్యారెక్టర్లు వారి వారి పాత్రల్లో మెప్పించాయి. ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్ వంటి ప్రముఖ నటీనటులు స్క్రీన్ టైమ్ కొన్ని సన్నివేశాలకే పరిమితం కావడంతో సినిమా కొంత లోటు కనిపించింది..ఓవరాల్ గా సినిమా ఫర్వాలేదనిపించింది.. కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..

రేటింగ్: 2.5/5

Read more RELATED
Recommended to you

Latest news