ఆసియా కప్ లో ఎవరు చేదించలేని సెహ్వాగ్ బౌలింగ్ రికార్డ్ !

-

క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా కప్ మరో వారం రోజుల్లో యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. ప్రధాన జట్లు భారత్, పాకిస్తాన్, టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుండగా.. శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ కూడా టైటిల్ రేసులో ఉన్నాయి. ఇందుకు సంబంధించి జట్లన్నీ ఇప్పటికే తమ ఆటగాళ్ల జాబితాని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఉత్తమ ప్రదర్శన చేసిన జట్లు ఏవి, భారత ట్రాక్ రికార్డు ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలిద్దాం..

ఆసియా కప్ లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన జట్లలో టీమిండియా అగ్రస్థానంలో ఉంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటివరకు మొత్తం 54 మ్యాచులు ఆడగా.. అందులో 36 విజయాలు అందుకుంది. ఒక మ్యాచ్ లో ఎలాంటి ఫలితం తేలేకపోగా.. ఆఫ్ఘనిస్తాన్ పై మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. చివరిసారి 2018 ఎడిషన్ భారత్ ఖాతాలోనే చేరింది. దీంతో మొత్తం ఏడుసార్లు ఆసియా కప్ ను ఇండియా సొంతం చేసుకుంది. అయితే ఆసియా కప్ లో భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఓ అరుదైన రికార్డు ఉంది. అయితే అది బ్యాటింగ్ లో అనుకుంటే పొరపాటే.. బౌలింగ్ లో.

ఆసియా కప్ చరిత్రలోనే వీరేంద్ర సెహ్వాగ్ బెస్ట్ బౌలింగ్ స్ట్రైక్ రేట్ రికార్డును నమోదు చేశాడు. 2010లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో సెహ్వాగ్ ఈ రికార్డుని నెలకొల్పాడు. సెహ్వాగ్ వేసిన కేవలం 2.5 ఓవర్లలో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి.. ఏకంగా 4 వికెట్లను పడగొట్టాడు. అంటే ప్రతి 4.2 బంతులకు ఒక వికెట్ తీశాడు. ఆసియా కప్ లో ఒక మ్యాచ్ లో ఒక బౌలర్ నమోదు చేసిన అత్యుత్తమ స్ట్రైక్ రేట్ ఇదే. అప్పుడు వన్డే ఫార్మర్ లో ఈ టోర్నీ జరిగింది. అయితే 12 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఈ రికార్డుని ఎవరు చేదించలేకపోయారు. ఈ రికార్డు ఇప్పటికీ సెహ్వాగ్ పేరు మీదనే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news