ఎన్నో స్కీమ్స్ ని కేంద్రం అందిస్తోంది. వీటి వలన మనకి ఎన్నో లాభాలుంటాయి. చాలా మంది తమకి నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు దానితో మంచిగా లాభాలను పొందుతున్నారు. కానీ కొందరు మాత్రం స్కీమ్స్ గురించి తెలియక అర్హులైనా సరే స్కీమ్స్ తాలూకా లాభాలను పొందలేకపోతున్నారు. అయితే మరి మనం స్కీమ్స్ కి అర్హులమా కాదా అనేది ఎలా తెలుసుకోవాలి అనేది చూద్దాం.
పూర్తి వివరాల లోకి వెళితే.. కేంద్ర ప్రభుత్వం మై స్కీమ్ పోర్టల్ లో అన్ని స్కీమ్స్ యొక్క వివరాలు ఉంటాయి. ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవడానికి గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు కూడా. సులభంగా మై స్కీమ్ పోర్టల్ లో అన్ని స్కీమ్స్ యొక్క వివరాలు తెలుసుకోవచ్చు.
స్మార్ట్‌ఫోన్‌లో కానీ కంప్యూటర్‌లో సింపుల్‌గా గవర్నమెంట్ స్కీమ్స్ గురించి చూడచ్చు. ఈ ఒక్క వెబ్‌సైట్‌లోనే స్కీమ్స్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. పైగా నచ్చిన భాషలో చూడచ్చు.
దీని కోసం ముందుగా మై స్కీమ్ పోర్టల్ https://www.myscheme.gov.in/ లోకి వెళ్ళండి.
నెక్స్ట్ మీరు Find Schemes For You పైన క్లిక్ చేయండి.
జెండర్, వయస్సు నొక్కి రాష్ట్రం పేరు, మీరు ఉంటున్న ప్రాంతం వివరాలను ఎంటర్ చెయ్యండి.
మీ సామాజిక వర్గాన్ని సెలెక్ట్ చెయ్యండి.
మీరు దివ్యాంగులు అయితే ఎస్ పైన లేదంటే నో అని నొక్కండి.
మైనారిటీ కూడా ఎంచుకోండి.
అలానే విద్యార్థి అవునో కాదో నొక్కండి.
ఎంప్లాయ్‌మెంట్ స్టేటస్ ని ఎంపిక చేసుకోండి.
వృత్తిని సెలెక్ట్ చేసి తర్వాతి పేజీలోకి వెళ్లాలి.
ఇక్కడ ఇప్పుడు మీకు ఏఏ ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయో వాటి వివరాలు పొందొచ్చు.