స్వర్గీయ నందమూరి తారక రామారావు సాంఘిక, జానపద ,పౌరాణిక వంటి ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఘనత ఈయనకే దక్కింది అని చెప్పవచ్చు. సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన, రాజకీయపరంగా కూడా అంతే పేరును సంపాదించుకున్నారు. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో చాలావరకు ప్రేమ వ్యవహారాలు అనేవి సర్వసాధారణం. అయితే ఇది ఇప్పటిది కాదు సుమా.. ఎన్టీఆర్ , ఏఎన్నార్ ల కాలం నుంచి వస్తున్న విషయమే. నచ్చితే ప్రేమిస్తారు లేకపోతే బ్రేకప్ చెప్పుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ఇక ఈ క్రమంలోని గతంలో లవ్ ట్రాక్ నడిపిన వాళ్లలో సీనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారనే విషయం ఇటీవల హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రముఖ నటి షావుకారు జానకి.. ఎన్టీఆర్ ఆ స్టార్ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారా అనే విషయం పై క్లారిటీ ఇచ్చింది. ఇదిలా వుండగా సీనియర్ ఎన్టీఆర్ – కృష్ణకుమారిల మధ్య ప్రేమ వ్యవహారం కన్నా ముందే ఆయనకు బసవతారకం తో వివాహం అయ్యింది. వారికి అప్పటికే 8 మంది కొడుకులు , నలుగురు కూతుర్లు జన్మించారు. అదే సమయంలో ఎన్టీఆర్ కృష్ణకుమారితో ఎక్కువ సినిమాలలో కూడా కలిసి నటించడం జరిగింది. ఆ సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించి.. పెళ్లి కూడా చేసుకోవాలనుకుని భావించారు అనే విషయం పై కృష్ణకుమారి సోదరి షావుకారు జానకి తాజాగా స్పందించారు.