వామ్మో ఇది సాహసమే :  హైకోర్టు కి ఎదురు వెళ్లబోతున్న జగన్ మోహన్ రెడ్డి .. !!

-

స్థానిక సంస్థల ఎన్నికలు  అయిన నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ నాయకుల విగ్రహాలకు కనబడకుండా గుడ్డలు చుట్టడం జరిగింది. ఇటువంటి తరుణంలో జగన్ ప్రభుత్వానికి అదిరిపోయే షాక్ ఇచ్చింది హైకోర్టు. మేటర్ లోకి వెళ్తే రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇష్టానుసారం వైసిపి పార్టీ రంగులు వేయటాన్ని తప్పుపట్టింది. రాష్ట్రంలో ఉన్న పంచాయతీ భవనాలకు వైసిపి పార్టీ రంగు తొలగించాలని కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది.Image result for jagan highఅదే టైంలో అసలు భవనాలకు పార్టీ రంగు ఎందుకు వేస్తారు అన్న దాని గురించి కూడా వివరణ ఇవ్వాలని  సీఎస్‌ను హైకోర్టు ప్రశ్నించింది. సమాధానం చెప్పకపోతే సిఎస్ ను బాధ్యలుగా చేస్తామని, హైకోర్ట్ స్పష్టం చేసింది. అలాగే గత ఏడాది ఆగస్టులో ఈ రంగుల పై ఇచ్చిన జీవోని కూడా హైకోర్ట్ కొట్టేసింది. గుంటూరు జిల్లా పల్లపాడుకు చెందిన ముప్పా వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్ట్, ఈ ఆదేశాలు ఇచ్చింది.

 

ఈ కేసు పై దాదాపుగా, 2 నెలల నుంచి వాదనాలు సాగుతున్నాయి. ఫిబ్రవరిలో ఈ కేసు పై వాదనలు ముగిసిన తరువాత, కోర్ట్ తీర్పు రిజర్వ్ చేసి, ఇటీవల తుది తీర్పు ఇచ్చింది. దీంతో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి అలా ఉండడం తప్పు కాదు అనే పిటిషన్ వేసే ఆలోచనలు ప్రభుత్వ లాయర్ తో జరుపుతున్నట్లు సమాచారం. ఈ విధంగా ముందుకు వెళ్తే కచ్చితంగా సాహసోపేతంగా హైకోర్టు కి ఎదురు వెళ్లినట్లే అని అంటున్నారు కొంతమంది న్యాయనిపుణులు.

Read more RELATED
Recommended to you

Latest news