తమిళ్ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘చంద్రముఖి’..ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పి.వాసు దర్శకత్వం వహించిన ఈ పిక్చర్ విడుదలై 17 ఏళ్లు కాగా, ఎట్టకేలకు ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటన అధికారికంగా తాజాగా వచ్చింది.
లేడీ సూపర్ స్టార్ నయనతార, విలక్షణ నటి జ్యోతిక ‘చంద్రముఖి’లో కీలక పాత్రలు పోషించారు. కాగా, ‘చంద్రముఖి-2’ సీక్వెల్ ఎలా ఉండబోతున్నదనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. మొదటి భాగంలో రజనీకాంత్ హీరో కాగా, సీక్వెల్ లో డ్యాన్సింగ్ స్టార్ లారెన్స్ రాఘవ జాయిన్ అయ్యాడు.
ప్రొడక్షన్ హౌజ్ లైకా ప్రొడక్షన్స్ ‘చంద్రముఖి–2’ గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది. పి.వాసు యే ఈ భారీ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించనున్నారు. వడివేలు కీలక పాత్రలో కనిపించనుండగా, ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం ఎంఎం.కీరవాణి అందించనుండగా, ఆర్ట్ డైరెక్టర్ గా తోట తరణి, డీఓపీగా ఆర్.డి.రాజశేఖర్ వ్యవహరించనున్నారు.
Elated to announce 🤩 our next Big project #Chandramukhi2 🗝️✨
Starring @offl_Lawrence & Vaigaipuyal #Vadivelu 😎
Directed by #PVasu 🎬
Music by @mmkeeravaani 🎶
Cinematography by @RDRajasekar 🎥
Art by #ThottaTharani 🎨
PRO @proyuvraaj 🤝🏻 pic.twitter.com/NU76VxLrjH— Lyca Productions (@LycaProductions) June 14, 2022