వైఎస్‌ షర్మిలకు రేవంత్‌ రెడ్డి ఫోన్‌.. ఇంకా..

-

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వయంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లకు ఫోన్ చేసి ముచ్చటించారు. రేపు నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశానికి రావాలంటూ వారిద్దరినీ ఆహ్వానించారు. ఈ సమావేశానికి వచ్చేందుకు షర్మిల సంసిద్ధత వ్యక్తం చేయగా, ప్రవీణ్ కుమార్ రాలేనని చెప్పినట్టు సమాచారం. అఖిలపక్షానికి తన ప్రతినిధులు వస్తారని రేవంత్ కు ఆయన బదులిచ్చినట్టు తెలుస్తోంది.

KCR, Jagan Idea Failed! Sharmila, Revanth Helping BJP!

‘బచావో హైదరాబాద్’ పేరిట కాంగ్రెస్ పార్టీ రేపు (జూన్ 15) అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. హైదరాబాదులో శాంతిభద్రతలు క్షీణిస్తున్నట్టు ఇటీవల జరిగిన ఘటనలు నిరూపిస్తున్నాయని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే, రేపు ఉదయం 10 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఈ మేరకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీకి అధికార టీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీలను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించలేదు. ఈ నేపథ్యంలో రేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండడంతో.. పోలీసు శాఖ అప్రమత్తమైంది.

 

Read more RELATED
Recommended to you

Latest news