పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. అలాంటి.. పెళ్లి.. ఎప్పుడు ఎవరికీ.. ఎవరితో జరుగుతుందో తెలీదు. అచ్చం అలాగే.. తమిళ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ జీవితంలోనూ చోటు చేసుకుంది. అవును.. తమిళ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్, ఓ ఇంటి వాడయ్యాడు. ఈ తమిళ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ సీరియల్ నటి, వీజె మహాలక్ష్మి పెళ్లి నిన్న తిరుపతిలో ఘనంగా జరిగింది.
బంధుమిత్రుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. ఇక ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతున్నాయి. వాటిని చూసి జనాలు అవాక్కవుతున్నారు. ఇదేంటి ఇంత లావుగా ఉన్న వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుందంటూ కామెంట్లు చేస్తున్నారు నేటిజెన్లు.
కాగా, ప్రస్తుతం నిర్మాత రవీందర్ చంద్రశేఖర్, రూపొందిస్తున్న రెండు సినిమాల్లోనూ మహాలక్ష్మి నటిస్తోందని సమాచారం. గతంలో ఈమె బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించింది. మరీ ముఖ్యంగా ‘వాణి రాణి: వంటి స్టార్ సీరియల్స్ లో మహాలక్ష్మికి మంచి పాత్రలు దక్కాయి. వాటితో ఆమెకు మంచి గుర్తింపు రావడమే కాక, ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు.