భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీలోని ఏపీ భవన్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. కంట్రోల్ రూమ్ నెంబర్లు 011-23387089, 9871999430,9871999053, 9871990081,9818395787 అని వెల్లడించింది. రాష్ట్ర ప్రజలకు సహాయం అందించడానికి ఏపీ భవన్ కృషి చేస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లో ఉన్న ఏపీ విద్యార్థుల కోసం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సహాయ చర్యలను ప్రారంభించింది. ఢిల్లీలో సరిహద్దు రాష్ట్రాల్లో లక్షల్లో తెలుగు వారు నివసిస్తున్నారు. వారి క్షేమ సమాచారాన్ని కనుక్కునేందుకు ఈ నెంబర్ ఉపయోగపడతాయని భావిస్తున్నారు.
పాకిస్తాన్ సైన్యం సరిహద్దుల్లో దాడులు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ దాడిలో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందిన విషయం తెలిసిందే. పూంచ్ సమీపంలో ఎక్కువగా దాడులు చేస్తోంది పాక్ సైన్యం. పాక్ దాడుల నేపథ్యంలో భారత ఆర్మీ కూడా ప్రతిదాడులు చేస్తోంది. ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్ సహా 9 నగరాలపై డ్రోన్లతో విరుచుకుపడుతోంది. మన దేశంలోకి ప్రవేశించిన 8 క్షిపణులను, 3 ఫైటర్ జెట్లను, భారీగా డ్రోన్లను నేలకూల్చింది.