‘శభాష్‌ మిథు’ ట్రైలర్ ఆగయా..మిథాలీరాజ్‌గా అదరగొట్టిన తాప్సీ

-

టాలెంటెడ్ హీరోయిన్ తాప్సీ పన్ను..తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. ప్రజెంట్ బాలీవుడ్ లో సత్తా చాటుతున్న ఈ భామ..టైటిల్ రోల్ ప్లే చేసిన లేటెస్ట్ ఫిల్మ్ ‘శభాష్ మిథు’. భారత మహిళా క్రికెట్‌కు అసాధారణమైన సేవలు అందించి, ఇటీవల రిటైర్మెంట్‌ ప్రకటించిన క్రికెటర్‌ మిథాలీరాజ్‌ జీవిత ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో..క్రికెటర్ గా ఎదగడానికి చిన్న నాటి నుంచి మిథాలీ రాజ్ పడిన కష్టాలను కళ్లకు కట్టినట్లుగా చూపించే ప్రయత్నం చేసినట్లు ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది.

మహిళల క్రికెట్‌కు గుర్తింపు తీసుకురావడం కోసం మిథాలీ రాజ్ ఎంత కష్టపడిందనేది సినిమాలో చూపించబోతున్నారు మేకర్స్. ‘ఉమెన్ ఇన్ బ్లూ’ అనే టీమ్..గురించి తాప్సీ చెప్పిన డైలాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కోసం తాప్సీ ఎంత కష్టపడిందనేది వెండితెరపైన స్పష్టంగా కనబడబోతున్నది. ఇప్పటికే ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. సినిమాపైన అంచనాలు భారీగా పెరిగాయి. వయాకామ్‌ 18 స్టూడియోస్‌ బ్యానర్ పై ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. వచ్చే నెల 15న సినిమా విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news