Asia cup 2022: పాక్ కొంపముంచిన క్యాచ్ డ్రాప్! తిట్టిపోస్తున్న పాకిస్థాన్ ఫ్యాన్స్!

-

ఆసియా కప్-2022లో అంచనాలే లేకుండా బరిలోకి దిగిన శ్రీలంక ఏకంగా ట్రోఫీని ఎగురేసుకుపోయింది. దుబాయ్ వేదికగా ముగిసిన పాకిస్తాన్, శ్రీలంక ఫైనల్ లో లంక, పాకిస్తాన్ పై 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే.. ఫైనల్ పోరులో తోలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది. అయితే.. ఇందులో భానుక రాజపక్సా 71 పరుగులు ఉన్నాయి.

అయితే రాజపక్సా ఇచ్చిన క్యాచ్ లను రెండు సందర్భాల్లో షాదాబ్ ఖాన్ వదిలేసి మూల్యం చెల్లించాడు. తొలి క్యాచ్ తాను వదిలేయగా, రెండో క్యాచ్ ను ఆసిఫ్ ఆలీ అందుకునే ప్రయత్నం చేశాడు.

అయితే ఆసిఫ్ ఆలీతో సమన్వయం లేకుండా మధ్యలో ఎంట్రీ ఇచ్చి షాదాబ్ క్యాచ్ ను నేలపాలు చేయడమే గాక ఏకంగా ఆరు పరుగులు సమర్పించాడు. ఆ తర్వాత తనను ఎక్కడ తిడతారో అని కాసేపు హైడ్రామా చేశాడు. దీంతో ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. “ఈరోజు పాకిస్తాన్ ఫీల్డింగ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు”, “ముఖ్యంగా షాదాబ్ ఖాన్, కాలం మారినా పాకిస్తాన్ ఫీల్డింగ్ లో మాత్రం మార్పు రాదు”, పాక్ ఆటగాళ్ల ఫీల్డింగ్ చూసిన తర్వాత ఆ జట్టు ఫీల్డింగ్ కోచ్ పారిపోవడం ఖాయం”, అంటూ కామెంట్స్ తో రెచ్చిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news