కేసీఆర్ ని హైకోర్ట్ మెచ్చుకుంటుందా…?

తెలంగాణాలో కరోనా కేసుల్ విషయంలో, కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్ట్ ఫైర్ అయిన తర్వాత పరిస్థితి కాస్త వేగంగా మారింది. కీలక నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ నేపధ్యంలో నేడు తెలంగాణ హై కోర్టు లో కరోనా కట్టడి పై విచారణ జరుగుతుంది. గతంలో కరోనా చర్యల పై హై కోర్టు అడిగిన ప్రశ్నలకు కౌంటర్ దాఖలు చేయనుంది ప్రభుత్వం.

ఇప్పటికే హై కోర్టు ఆదేశాలతో రాష్ట్రంలో లాక్ డౌన్ ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. పది రోజుల పాటు లాక్ డౌన్ పొడగించిన ప్రభుత్వం… పరిస్థితిని బట్టి తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉండవచ్చు. వాక్సినేషన్ ప్రక్రియ పై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్ట్ కి పూర్తి వివరాలు తెలిపే అవకాశం ఉంది.