తెలంగాణ లో YSRTP అన్న పార్టీని స్థాపించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురిగా అయన ఆశయాలను నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు వెళుతోంది వైఎస్ షర్మిల. ఇందులో భాగంగానే అధికార పార్టీ BRS ను మరియు సీఎం కేసీఆర్ ను పరిస్థితికి తగినట్లుగా విమర్శలు చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కాగా ఇటీవల కొద్దీ రోజుల నుండి కాంగ్రెస్ లో షర్మిల పార్టీని విలీనం చేస్తుందన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కాగా తాజాగా షర్మిల ఢిల్లీ వెళ్లి కాసేపటి క్రితమే తిరిగి వచ్చింది. అయితే షర్మిల రాగానే మీడియా ఆమెను ప్రశ్నల వర్షంలో ముంచెత్తింది. మీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నారా ? ఎప్పుడు ? అంటూ గందరగోళానికి గురి చేసే ప్రయత్నం చేశారు. ఇందుకు షర్మిల చాలా సమయస్ఫూర్తితో మీడియా తో మాట్లాడడానికి అంగీకరించలేదు.
షర్మిల మాట్లాడుతూ త్వరలోనే అన్ని విషయాలను నేను చెబుతానని దాటవేసింది. కాగా ఢిల్లీ వెళ్లిన షర్మిల అక్కడ ఎవరిని కలిసింది ? ఏమి చర్చలు జరిగాయి అన్న కీలక విషయాలు తెలియాల్సి ఉంది.