పాలేరు ఫిక్స్ చేసిన షర్మిల..సమీకరణాలు మారనున్నాయా?

-

ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో దూకుడుగా ముందుకెళుతున్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల..వచ్చ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోయే సీటుపై క్లారిటీ ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరులో పోటీ చేస్తానని ఇదివరకే ప్రకటించారు. ఇప్పుడు ఆ సీటుపై క్లారిటీగా తేల్చేశారు. ఖచ్చితంగా పాలేరులోనే పోటీ చేస్తానని, త్వరలోనే పార్టీ ఆఫీసు కూడా ప్రారంభిస్తామని చెప్పారు.

అయితే కేసీఆర్ ప్రభుత్వంపై దూకుడుగా ముందుకెళుతున్న షర్మిల ఇటీవల కాలంలో రాజకీయంగా బాగా హైలైట్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీతో ఢీ అంటే ఢీ అనేలా ఫైట్ చేస్తున్నారు. అలాగే పాదయాత్రకు పోలీసులు బ్రేకులు వేసిన కోర్టుకెళ్లి మరీ అనుమతి తెచ్చుకున్నారు. మళ్ళీ పాదయాత్రని మొదలుపెట్టనున్నారు. ఇక ఇదే సమయంలో పాలేరులో పోటీ చేస్తానని చెప్పేశారు. ఇక షర్మిల పాలేరులో పోటీ చేస్తే రాజకీయ సమీకరణాలు ఊహించని విధంగా మారే అవకాశాలు ఉన్నాయి.

మొదట ఈ సీటులో కాంగ్రెస్ పార్టీకి, కమ్యూనిస్టులకు పట్టు ఎక్కువ. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఉపేందర్ రెడ్డి గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్లారు.  బీఆర్ఎస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసి ఓడిపోయారు. ఉపేందర్ పార్టీలోకి రావడంతో ఈ సీటులో పోటీ ఉంది. పాలేరు బీఆర్ఎస్ సీటు ఉపేందర్‌కు దక్కుతుందా? లేదా తుమ్మలకు దక్కుతుందో క్లారిటీ లేదు. అటు కాంగ్రెస్ నుంచి రాయల నాగేశ్వరరావు ఉన్నారు. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ బలం తగ్గుతూ వస్తుంది. బీజేపీకి అంత బలం లేదు.

ఇక వైఎస్సార్ అభిమానులు ఎక్కువ ఉండటంతో షర్మిల ఇక్కడ పోటీ చేస్తానని అంటున్నారు. అటు రెడ్డి వర్గం ఓట్లు ఎక్కువ. కాంగ్రెస్ శ్రేణులు సైతం వైఎస్ పై అభిమానంతో తన వైపు మొగ్గు చూపుతారని షర్మిల భావిస్తున్నారు. అంత మాత్రాన గెలుపు ఈజీ కాదు. అటు టీడీపీ కూడా బరిలో ఉండాలని చూస్తుంది. మొత్తానికి పాలేరులో షర్మిల గెలుపు అంత ఈజీ కాదు.

Read more RELATED
Recommended to you

Latest news