ఎప్పుడయితే బహుబలి పాన్ ఇండియా స్థాయి విజయం సాధించడం , దానికి తోడు కేజీఫ్ లాంటి సూపర్ హిట్స్ రావటం వల్ల బాలీవుడ్లో అందరూ దక్షిణాది సినీ పరిశ్రమ వైపు అడుగులు వేయడం మొదలు పెట్టారు. ఇదే సమయంలో బాలీవుడ్ సినిమాలు అన్నీ ప్లాప్ అవుతున్నాయి. ఇన్నాళ్ళు భారతీయ సినిమా పరిశ్రమ ను శాషించిన బాలీవుడ్ వారికి మింగ లేక కక్క లేని పరిస్థితులు ఎదురుఅయ్యాయి.
అలాగే తమ సినిమా లకు పెట్టిన పెట్టుబడి కూడా రాబట్టుకోలేక పోతున్నాయి. దానిపై వారి కంటెంట్ లేకుండా గ్లామర్ మాత్రమే నమ్ముకొని తీస్తున్నారని అందుకే బోల్తా కొట్టాయి అని క్రిటిక్స్ అన్నారు. తాజాగా దీనిపై దర్శకుడురాజమౌళి తనదైన విశ్లేషణ చేశారు.తాజా గా ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ.. ‘బాలీవుడ్‌లోకి కార్పోరేట్లు వచ్చి నటీనటులకు, దర్శకులకు ఎక్కువ డబ్బులు ఇవ్వడం చేశారు. దానితో వారిలో ఎలాగైనా సక్సెస్ కొట్టలాన్నా కసి పొయింది. అందుకే చాలా సినిమాలు ప్లాప్ అయ్యాయి అన్నారు.
కాని దక్షిణాది సినిమా పరిశ్రమ లో అలాంటి వాతావరణం లేదూ. సినిమా ఒప్పుకున్నాము అంటే వంద శాతం కష్టపడి పని చేస్తాము. అలాగే సినిమా తీసిన తర్వాత కూడా మరో సారి చెక్ చేసుకుంటూ ప్రేక్షకులకు చేరే వరకు మేము ప్రయత్నం చేస్తూనే వుంటామని, అప్పుడే మాత్రమే సక్సెస్ సొంతమవుతుంది’ అని చెప్పుకొచ్చాడు