బ్రేకింగ్ : చైత్ర ఇంటి దగ్గర వైయస్ షర్మిల నిరాహార దీక్ష!

సైదాబాద్ లోని చిన్నారి చైత్ర కుటుంబాన్ని వైఎస్ షర్మిలా పమర్శించారు. ఈ సందర్బంగా వైఎస్ షర్మిలా మాట్లాడుతూ.. ఇంత ఘటన జరిగితే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని.. ప్రగతి భవన్ లో కుక్క చనిపోతే చర్యలు తీసుకున్నారు…కానీ ప్రజలు అంటే లెక్కలేదని మండిపడ్డారు. 2014లో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు 938 వేధింపులు కేసులు ఉంటే…అవి 2020 కి మూడు రెట్లు అయ్యాయని నిప్పులు చెరిగారు.

Sharmila
Sharmila

తెలంగాణ లో గంజాయి, డ్రగ్స్, మద్యం ఏరులై పారుతుందని.. బంగారు తెలంగాణ కాదు.. బారులు, బీర్ల తెలంగాణ అయిందని మండిపడ్డారు. ఈ ఘటనపై కెసిఆర్ స్పందించేంత వరకు నిరాహార దీక్ష కు కూర్చుంటానని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి పదికోట్ల పరిహారం ప్రకటించాలని.. కేటీఆర్ దత్తత తీసుకున్న ప్రాంతమే ఇట్లా ఉంటె రాష్ట్రం పరిస్థితి ఏంటి ? అని నిలదీశారు. ఈ ప్రాంతలో ఇక్కడ నీళ్లు దొరకవు, కానీ మద్యం దొరుకుటుందట అని.. ఇది పోలీసుల వైఫల్యం కాదా ? అని నిలదీశారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా ? మండిపడ్డారు. పోలీసులు ఎంతబాగా పనిచేస్తున్నారో తెలియజేయడానికి ఇదొక ఉదాహరణమన్నారు.