ఖబడ్దార్.. YSR విగ్రహాలను కూల్చిన పిరికి పందల్లారా! అంటూ ఓ రేంజ్ లో షర్మిల రెచ్చిపోయారు. ప్రజల్లో మీకు మొఖం చెల్లక.. మిమ్మల్ని ప్రజలు చీదరించుకుంటున్నారని.. అసహనంతో YSR విగ్రహాలను కూల్చుతున్నారా? అని అగ్రహించారు. YSR తెలంగాణ పార్టీకి వస్తున్న ఆదరణను తట్టుకోలేక.. మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని దౌర్బాగ్యుల్లారా.. అని మండిపడ్డారు.
ఎదురుగా వచ్చి పోరాడే దమ్ము లేదు గానీ వైయస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారా? మీకు దమ్ముంటే మాతో చర్చకు రండని సవాల్ విసిరారు. చర్చించే దమ్ములేని దద్దమ్మల్లారా.. మీరు విగ్రహాలు కూల్చినంత మాత్రాన.. జనం గుండెల్లో కొలువైన వైయస్ రాజశేఖర రెడ్డి గారి స్థానాన్ని ఎవరూ కూల్చలేరన్నారు.
కేసీఆర్ కు కాళేశ్వరం ఒక ఏటీఎంలా పని చేస్తుందని, కాళేశ్వరంతో వేల కోట్లు సంపాదించాడని కేంద్ర బీజేపీ పెద్దలు చెప్తున్నారు కానీ ఎందుకు విచారణ జరిపించడం లేదు? అధికారంలో ఉండి కూడా ఎందుకు ఎంక్వైరీ చేయించడం లేదు? టీఆర్ఎస్ కు ‘బీ’ టీంగా బీజేపీ పనిచేస్తుందా? అని ఫైర్ అయ్యారు.