షారుఖ్ ఖాన్ “జవాన్” రిలీజ్ డేట్ ఫిక్స్… !

-

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఇంత వయసు వచ్చినా అదే నటన, బాడీ లాంగ్వేజ్ మరియు యాక్షన్ తో కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఈ మధ్యన విడుదల ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న పఠాన్ సినిమా తర్వాత వస్తున్న సినిమా “జవాన్”. ఈ సినిమా కూడా దేశభక్తిని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని నిర్మించినట్లు అర్ధమవుతోంది. ఈ సినిమాను తమిళ యంగ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తుండడం విశేషం, అట్లీ సినిమాలకు ఇప్పటి వరకు దక్షిణాదిలో మంచి డిమాండ్ ఉంది. కెరీర్ లో తొలిసారి షారుఖ్ ఖాన్ లాంటి ఉత్తరాది హీరోతో సినిమా చేస్తున్నాడు.

కాగా తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ వచ్చింది, జవాన్ ను సెప్టెంబర్ 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయడానికి టీం నిర్ణయించుకుంది. మరి జవాన్ తో షారుఖ్ ఖాన్ మళ్ళీ హిట్ కొడతాడా లేదా అన్నది తెలియాలంటే సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news