ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఎంపీ శశి థరూర్ హైదరాబాద్ వచ్చారు. పార్టీలో తామంతా ఒక్కటేనని.. తమకు సిద్ధాంతపరంగా వైరుధ్యాలేమీ లేవని చెప్పారు. బీజేపీని ఎలా ఎదుర్కోవాలనేదానిపైనే తామంతా చర్చిస్తున్నామని తెలిపారు. అధ్యక్ష ఎన్నికపై కాంగ్రెస్‌లో జరుగుతోంది అంతర్గత చర్చేనని అన్నారు.
‘‘పార్టీ ఫండమెంటల్ విషయాల్లో నాది, ఖర్గేది ఒకటే స్టాండ్. కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఎవరు శక్తిమంతులనేదే ప్రధాన ప్రశ్న. నేను ఇటీవలే ఖర్గేతో మాట్లాడాను. ఆయన గొప్పనేత. ఖర్గేతో నాకు మంచి సంబంధాలున్నాయి. పారదర్శక ఎన్నికు గాంధీ ఫ్యామిలీ కట్టుబడి ఉంది. తెలంగాణ నాయకులతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్‌లో జీ23 అనేదే లేదు. ఖర్గేకు, నాకు ఎవరి విజన్ వాళ్లకుంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తన ఇంటికి ఆహ్వానించారు.. కానీ వెళ్లలేకపోయాను. రేవంత్ పిలిస్తే తప్పకుండా గాంధీభవన్‌కు వెళ్లి ప్రచారం చేసుకుంటా’’ అని శశిథరూర్ అన్నారు.