మెరిసిపోయే స్కిన్ టోన్.. బ్లూ లెహంగా సదా అందాల విందుకు నెటిజన్లు ఫిదా..

-

టాలీవుడ్ హీరోయిన్ సదా కొన్నాళ్లపాటు తెలుగులో వరుస సినిమాలు చేస్తూ మంచి పేరు సంపాదించుకుంది. అయితే దాదాపు నాలుగేళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ భామ.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా కనిపిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా సదా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి..ప్రస్తుతం చాలామంది హీరోయిన్లు సినిమాలకు దూరంగా ఉంటున్నా సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతున్నారు. ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలి అనుకునే హీరోయిన్లు ఇందులో ముందుంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లతో హల్చల్ చేస్తున్నారు. అదిరిపోయే ఔట్ఫిట్స్, ట్రెడిషనల్ డ్రెస్ లో అభిమానుల్ని ఆకట్టుకుంటున్నారు. ఇదే జాబితాలో చేరారు సీనియర్ హీరోయిన్ సదా..

 

తాజాగా సదా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు చూసే వారిని ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఇందులో సదా ట్రెడిషనల్ డ్రెస్ లో అదిరిపోయే ఔట్ ఫిట్ తో కనిపించారు.. ట్రెడిషనల్ లుక్ లో సదా ఎప్పుడూ బ్యూటీఫుల్ గానే ఉంటారనే విషయం తెలిసిందే. ఇక ఇటీవల మరింత యంగ్ గా కనిపించేందుకు లెహంగాలో దర్శనమిస్తూ అందాల విందు చేస్తున్నారు. మతిపోయే పోజులతో కట్టిపడేస్తున్నారు. లేటెస్ట్ పిక్స్ లో సదా బ్లూ లెహంగా, అట్రాక్టివ్ ఎంబ్రాయిండింగ్ గల బ్లౌజ్ లో దర్శనమిచ్చారు. అప్పటికే మెరిసిపోయే స్కిట్ టోన్ పై సంప్రదాయ దుస్తులు మరింతగా షైన్ అవుతున్నాయి. దీంతో చూపు తిప్పుకోలేని అందాన్ని సొంతం చేసుకున్నారు.

ప్రస్తుతం సదా బీబీజోడీ డాన్స్ షో కు జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ షో కోసం సదా ఇలా ముస్తాబయ్యారని తెలుస్తుంది.. అలాగే టాలీవుడ్ కింగ్, నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ తెలుగు’ కంటెస్టెంట్లు ఈషోలో జోడీగా పెర్ఫామెన్స్ ఇస్తున్నారు. ఇప్పటికే పలు ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది. సదా జడ్జీగా తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version