నిర్మాతలు బ్లాంక్ చెక్ ఇచ్చినా సహాయ పాత్రలకు నో చెప్పేసిన శోభన్ బాబు.. ఇన్ని హిట్ సినిమాలు వదులుకున్నారా..

-

శోభన్ బాబు ఎవరికైనా అందంతో తెలుగు సినిమాల్లో సోగ్గాడిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో.. ఎన్టీఆర్ ఏఎన్నార్ కాలం నుంచి ఇప్పటివరకు టాలీవుడ్ అందగాడు ఎవరు అంటే శోభన్ బాబు అనేంతలా పేరు సంపాదించారు.. తన అందంతో కుటుంబ ప్రేమకథా చిత్రాలతో ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్న శోభన్ బాబు మూడున్నర దశాబ్దాల పాటు తెలుగులో హీరోగా కొనసాగారు.. ఎన్నో యాక్షన్, డిఫరెంట్ పాత్రలతో ప్రేక్షకులను అలరించినా.. ముఖ్యంగా ఇద్దరు భార్యల మధ్యలో నలిగిపోయే పాత్రలతో మహిళ ప్రేక్షకులను మెప్పించారు… హీరో గా మంచి స్థాయిలో ఉన్నప్పుడే రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ షాక్కు గురి చేశారు.. ఆ తర్వాత చాలామంది సహాయక పాత్రల్లో నటించమని అడిగినా సున్నితంగా తిరస్కరించేవారు అయితే శోభన్ బాబు తిరస్కరించిన చాలా సినిమాలు తర్వాత సూపర్ డూపర్ హిట్ అయ్యాయి అవి ఏంటో ఒకసారి చూద్దాం..

ఎన్నో గొప్ప పాత్రలను తిరస్కరించిన శోభన్ బాబు.. ముఖ్యంగా కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరెకేక్కిన అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్ర కోసం ముందుగా శోభన్ బాబుని అనుకున్నారంట కానీ ఈయన ఆ పాత్రను చేయాలని సున్నితంగా చెప్పేసారంట.. తర్వాత ఆ పాత్రను నందమూరి బాలకృష్ణ తో చేయించాలి అని అనుకోగా అతను కూడా కాదనటంతో హీరో సుమన్ చేశారు.. అయితే ఈ పాత్రలో ఎంతగానో ఒదిగిపోయారు సుమన్..

అలాగే మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన ‘అతడు’ సినిమాలో తాత పాత్ర కోసం నిర్మాత మురళీమోహన్ శోభన్ బాబు బ్లాక్ చెక్కించారు అంట ఈ పాత్రలు నటించి ఎంతైనా తీసుకోండి అని అనగా చేయనని చెప్పేసారంట శోభన్ బాబు..

అలాగే పవన్ కళ్యాణ్ హీరోగా భీమినేని శ్రీనివాస రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సుస్వాగతం’లో తండ్రి క్యారెక్టర్ రఘువరణ్ పాత్ర కోసం ఆర్.బి.చౌదరి ముందుగా శోభన్ బాబు గారిని అనుకున్నారు.. కానీ శోభన్ బాబు చేయనంటే చేయనని ఒకేమాట మీద నిలబడ్డారు. అయితే ఇవన్నీ ఒక వైపు మాత్రమే అతన్ని హీరోగా చేయమని కూడా ఎన్నో అవకాశాలు వస్తున్న సమయంలోనే రిటైర్మెంట్ ప్రకటించి జీవితాన్ని ప్రశాంతంగా గడిపారు..

Read more RELATED
Recommended to you

Latest news