అమెజాన్ ప్రైమ్ తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ధరలను తగ్గించినట్టే తగ్గించి..ఇప్పుడు అమాంతం పెంచేసింది. గతంలో ధరలతో కంపేర్ చేస్తే కొత్త ధరలు అదనంగా రూ.140 వరకు పెరిగింది. అయితే ఈ ధరల వాటిలో ఇయర్లీ సబ్ స్ర్కిప్షన్ తీసుకున్న సభ్యులకు మాత్రం మినహాయింపు నిచ్చింది. వీటి ధరలను యధావిధిగా కొనసాగిస్తూ అమెజాన్ ప్రైమ్ తాజాగా నిర్ణయం తీసుకుంది.
అమెజాన్ మంత్లీ మెంబర్ షిప్ ధర గతంలో రూ.179 ఉండేది. తాజాగా పెంచిన ధరతో మంత్లీ సబ్ స్క్రిప్షన్ ధర రూ. 299కి చేరింది. అంటే కొత్తగా రూ.120 రూపాయలను పెంచింది.. ఇక త్రైమాసిక మెంబర్ షిప్ ధర రూ.459 నుంచి రూ.599కి పెరిగింది. అంటే రూ.140 వరకు పెరిగినట్లయింది. ఈ పెరిగిన ధరలను చూస్తుంటే అమెజాన్ తన ఇయర్లీ ప్లాన్ ను వినియోగదారులు సబ్ స్క్రైబ్ చేసుకునేలా ప్రోత్సాహిస్తుందని అర్థమవుతుంది. అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ సంవత్సర కాలానికి గతంలో చెల్లించినట్లే ఇప్పుడు కూడా రూ. 1499 చెల్లించాల్సి ఉంటుంది..
కొత్త ధరలు కొత్తగా సబ్ స్క్రిప్షన్ తీసుకునేవారికి వర్తించనున్నాయి. ఇప్పటికే మంత్లీ, క్వార్టర్లీ ప్లాన్స్ ను సబ్ స్క్రైబ్ చేసుకున్నవారు, ఆటో రెన్యువల్ సెట్ చేసుకున్నవారికి పాత ధరలే అమలులో ఉంటాయి. అయితే 2024 జనవరి 15 వరకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఆ తర్వాత కొత్త ధరలు వర్తిస్తాయి. మొత్తంగా, అమెజాన్ ధరలను పెంచితే పోటీదారైన నెట్ ఫ్లిక్స్ మాత్రం తన ప్లానులను పాత ధరలకే అందిస్తుంది.. ఇక అమెజాన్ కు కస్టమర్లు తగ్గే అవకాశం ఉంది..