ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాహనదారులకు రాష్ట్ర రవాణా శాఖ షాక్ ఇచ్చింది. రీ – రిజిస్ట్రేషన్ ఫీజులను భారీగా పెంచుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా దీనికి సంబంధించిన ఆదేశాలను సైతం జారీ చేశారు. అయితే ఈ ఆదేశాలు.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 15 ఏళ్లు దాటిన రవాణా, రవాణా యేతర వాహనాలకు వర్తించనుంది. రాష్ట్రంలో 15 ఏళ్లు దాటిన వాహనాల రెన్యువల్ రిజిస్ట్రేషన్ ఫీజులను రవాణా శాఖ భారీగా పెంచింది.
రీ – రిజిస్ట్రేషన్ కు గతంలో ఎప్పుడూ లేని విధంగా.. ఇప్పుడు వాహనాల ఫిట్ నెస్ పరీక్ష చేసేందకు ఫీజు వసూల్ చేయబోతుంది. దీంతో వాహనాదారులపై భారం పడనుంది. తాజా గా రవాణా శాఖ జారీ చేసిన ఉత్తర్వులు.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు కానున్నాయి. కాగ పెరిగిన రీ – రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇలా ఉన్నాయి.
బైక్ రీ – రిజిస్ట్రేషన్ కు.. రూ. 1000, ఆటో రూ. 2,500, కార్లు, జీపుల రీ – రిజిస్ట్రేషన్ కు రూ. 5,000 వరకు పెరిగింది. అలాగే దిగుమతి చేసుకున్న కార్ల రీ – రిజిస్ట్రేషన్ కు రూ. 40 వేల వరకు రవాణా శాఖ పెంచింది.