పెరుగు తినడం వల్ల ఉపయోగాలు తెలిస్తే షాక్..!!

-

పూర్వపు రోజులలో పెరుగు ప్రతి ఒక్కరి ఇంట్లో మెండుగా లభించేది. కానీ ఈ మధ్యకాలంలో అన్ని ప్యాకెట్లు రూపంలో రావడంతో అవసరమైనప్పుడు మాత్రమే తెచ్చుకుంటూ మిగతా సమయాలలో వాటిని తినడం మానేస్తూ ఉన్నారు ప్రజలు. దీంతో పలు రకాల రోగాల బారిన పడే అవకాశం ఉందని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. ప్రతిరోజు పెరుగు తినడం వల్ల ఏకంగా పలు లాభాలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం.

ప్రతిరోజు పెరుగును తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉండే అనేక సమస్యలను దూరం అవుతాయి ముఖ్యంగా శరీరంలో పోషకాలు బాగా సమృద్ధిగా పెరుగుతాయి.. అంతేకాకుండా శరీరంలోని ఎముకలు దృఢంగా ఉండడానికి కూడా పెరుగు చాలా సహాయపడుతుంది. ఎండ విముక్తి పొందాలి అన్న పెరుగు తినాల్సిందే. ముఖ్యంగా పెరుగు అన్నం కలుపుకొని తినడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా పెరుగులో కార్బోహైడ్రేట్, ఐరన్, కాల్షియం, విటమిన్ కె, విటమిన్ -B-6,A,C వంటితోపాటు కాపర్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. అందుచేతనే పెరుగును ప్రతి ఒక్కరు తినాల్సిందిగా వైద్యులు సూచిస్తూ ఉంటారు.

1).పెరుగు తరచూ తినడం వల్ల.. మన శరీరంలో రోగనిరోధక శక్తి బలంగా పెరిగి గుండెను చాలా జాగ్రత్తగా ఉండేలా చూస్తూ ఉంటుంది.

2). అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులు బరువు తగ్గాలనుకుంటే ప్రతిరోజు ఆహారంలో పెరుగుని చేర్చుకోవడం వల్ల తగ్గుతారని నిపుణులు తెలియజేస్తున్నారు. ఎందుచేత అంటే పెరుగులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మన శరీరంలో ఉండే కొవ్వు కూడా కరిగి బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

3). మన పూర్వీకులు ఎక్కువగా పెరుగు అన్నం తింటూ ఉండడం వల్ల వారు ఎంతో బలంగా ఉంటారు. అంతేకాకుండా వారి ఎముకలు కూడా చాలా బలంగా ఉంటాయి. అందుచేతనే ప్రతి ఒక్కరు కూడా పెరుగు అన్నం తినడం వల్ల మన శరీరంలో దంతాలతో పాటు ఎముకలు కూడా చాలా బలంగా మారుతాయి.

మరి ముఖ్యంగా జీర్ణ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడే వ్యక్తులు పెరుగు అన్నం తినడం వల్ల పలు ప్రయోజనాలు ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news