తెలంగాణలో మరో మూడు రోజులు అతి భారీ వర్షాలు !

-

తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు అతి భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. నిన్న దక్షిణ ఒరిస్సా- ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం ఈ రోజు తీవ్ర అల్పపీడనంగా బలపడి ఒరిస్సా తీరము & పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఈ అల్పపీడనంకి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ వరకు విస్తరించి ఎత్తుకి వెళ్లే కొలది నైరుతి దిశగా వంపు తిరిగి ఉంది.

నిన్నటి ఉపరితల ఆవర్తనం మరియు ఈస్ట్‌వెస్ట్ షీర్ జోన్ ఈ రోజు 20°N వెంబడి సగటు సముద్రం మట్టంకి 3.1 కి.మీ నుండి 7.6 కిమీ ఎత్తు వరకు ఉత్తర ద్వీపకల్ప భారతదేశం అంతటా వ్యాపించి ఎత్తుకి వెళ్లే కొలది దక్షిణం వైపుకి వంపు తిరిగి ఉంది. ఈ రోజు రుతుపవన ద్రోణి జైసాల్మర్, కోట, మాండ్ల , రాయిపూర్, ఝార్సిగూడ,తీవ్ర అల్పపీడన మధ్యభాగం మీదుగా ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీంతో ఈ రోజు, రేపు తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షములు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షములు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది.

వాతావరణ హెచ్చరికలు

ఈ రోజు, రేపు *తెలంగాణ రాష్ట్రంలో భారీ, అతిభారీ వర్షంతో పాటు, ఈ రోజు అత్యంత భారీ వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఎల్లుండి భారీ వర్షాలు అక్క డక్కడ వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news