సోను సుద్ రైఫిల్ ఇచ్చాడు.. ఆమె ఆత్మహత్య చేసుకున్నది

-

ఆ క్రీడాకారిణి ఇబ్బందులు తెలుసుకొని బాలీవుడు నటుడు సోను సుద్ రైఫిల్ కొనిచ్చాడు. జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించాడు. కానీ, సరైన అవకాశాలు లేక డిప్రెషన్‌‌తో ఆత్మహత్యకు పాల్పడింది.

పశ్చిమబెంగాల్‌కు చెందిన షూటింగ్ క్రీడాకారిణి కోనికా లాయక్ హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నది. సంఘటన స్థలంలో పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది. తీవ్రమైన డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కోనికా సూసైడ్ నోట్‌లో పేర్కొన్నది. గత ఫిబ్రవరిలోనే ఆమెకు వివాహమైంది. సరైన అవకాశాలు లభించకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఆత్మహత్యతో కలిపి గత కొంత కాలంలో నలుగురు షూటింగ్ క్రీడాకారిణులు బలవన్మరణానికి పాల్పడ్డారు.

కోనికా లాయక్ రాష్ట్రస్థాయిలో పలు మెడల్స్‌ను గెలుపొందింది. కోల్‌కతాలో అర్జున అవార్డు గ్రహీత జోయ్‌దీప్ కర్మాకర్‌తో కలసి ఆమె సాధన చేసింది. జార్ఖండ్‌లో జరిగిన రాష్ట్రస్థాయి షూటింగ్ పోటీల్లో బంగారు, వెండి పతకాలను గెలుపొందింది.

ఈ ఏడాది మొదట్లో సరైన రైఫిల్ లేకపోవడంతో షూటింగ్ సాధనలో ఇబ్బంది పడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొనడంతో స్పందించిన బాలీవుడ్ నటుడు సోనుసుద్ ఆమెకు జర్మనీ తయారీ రైఫిల్‌ను కొనిచ్చాడు. ఆ తర్వాత ఆమె జాతీయస్థాయితోపాటు ఇతర పోటీల్లో పాల్గొన్నది.

‘సోను సుద్ సార్, ఇదిగో నా రైఫిల్. మా కుటుంబం ఎంతో ఆనందంగా ఉన్నది. మా గ్రామం మొత్తం మిమ్మల్ని దీవిస్తున్నది. మీరు కలకాలం బాగుండాలి’ అని కొవిడ్-19 మహమ్మారి సమయంలో సోను సుద్ పంపిన రైఫిల్‌‌ను అందుకున్న తర్వాత కోనికా లాయక్ ట్వీట్ చేసింది.

కర్మాకర్ అకాడమీలో నామమాత్రపు ఫీజుతోనే కోనికా శిక్షణ పొందుతున్నది. విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు కోల్‌కతాకు చేరుకున్నారు.

ఇటీవల కాలంలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో షూటింగ్ క్రీడాకారుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. కోనికా లాయక్ ఆత్మహత్య నాలుగోది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version