చాలా మంది పొట్ట చుట్టూ ఉండే కొవ్వు సమస్యతో బాధపడుతూ ఉంటారు మీకు కూడా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిందా..? దాని వలన ఇబ్బంది పడుతున్నారా..? అనేక వ్యాయామ పద్ధతుల్ని పాటించిన కూడా ఎటువంటి ఫలితం లేదా..? అయితే కచ్చితంగా మీరు ఇలా చేయాల్సిందే.. ఈ విధంగా ఫాలో అయితే కచ్చితంగా పొట్ట చుట్టూ ఉండే కొవ్వు పోతుంది అలోవెరా ఆరోగ్యానికి అందానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలోవెరా తీసుకుంటే చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు.
మెగ్నీషియం ఐరన్ డ్రింక్ సెల్ జింక్ సెలీనియం సోడియం మ్యాంగనీస్ మొదలైన పోషక పదార్థాలు మనకి కలబంద లో లభిస్తాయి అలోవెరా జ్యూస్ ని గోరు వెచ్చని నీళ్లతో కాళీ కడుపున తీసుకోవడం వలన పొట్ట చుట్టూ ఉండే కొవ్వు క్రమేపి తగ్గిపోతుంది ఫైనల్ గా మీ పొట్ట ఫ్లాట్ గా మారుతుంది.
అలోవెరా మరియు నిమ్మరసం: దీని కోసం ముందు మీరు కలబంద మట్ట తీసుకుని శుభ్రంగా కడిగి గుజ్జును బయటకు తీసుకోండి. ఇప్పుడు ఒక గ్లాసు నీళ్లలో ఆ గుజ్జు వేసి కొద్దిగా నిమ్మరసాన్ని కూడా వేసుకుని తీసుకోండి కొన్ని రోజులు పాటు ఇలా తీసుకోవడం వలన పొట్ట చుట్టూ ఉండే కొవ్వు తగ్గిపోతుంది.
కలబంద జ్యూస్:
ఆహారాన్ని తినే ముందు అలోవెరా జ్యూస్ తీసుకుంటే పొట్ట చుట్టూ ఉండే కొవ్వును తొలగించుకోవచ్చు. అలోవెరా జ్యూస్ ని మీరు ఆహారాన్ని తీసుకోవడానికి 15 నిమిషాల ముందు తీసుకోండి. ఇలా చేయడం వలన మెటాబలిజం బూస్ట్ అవుతుంది దీంతో కొవ్వు నెమ్మదిగా కరుగుతుంది. అజీర్తి సమస్యలు కూడా ఉండవు. బాగా అరుగుతుంది.
తిప్పతీగ అలోవెరా జ్యూస్:
తిప్పతీగ అలోవెరా జ్యూస్ ని కూడా తీసుకోవచ్చు 1 స్పూన్ అలోవెరా ఒక టీ స్పూన్ తిప్పతీగ జ్యూస్ ని నీళ్ళల్లో కలుపుకొని ఉదయాన్నే ఖాళీ కడుపుని తీసుకుంటే పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కొన్ని రోజులలోనే తగ్గిపోతుంది.